రివ్యూ: నీరసంగా ‘రంగ రంగ వైభవంగా…’

ప్రపంచతెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నిర్మాణ సంస్థ : శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి
నటీనటులు: వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ, నవీన్ చంద్ర, సీనియర్ నరేష్, ప్రభు, ప్రగతి, తులసి తదితరులు
సినిమాటోగ్రఫీ: షామ్‌దత్ సైనుదీన్
కూర్పు : కోటగిరి వెంకటేశ్వర్ రావు
పాటలు: శ్రీమణి
సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్
నిర్మాతలు: బి వి ఎస్ ఎన్ ప్రసాద్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : గిరీశాయ
విడుదల తేదీ:02.09.2022

మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ అంద‌రి దృష్టిని ఆకర్షించిన చిత్రం ‘ఉప్పెన’ ఆ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ కావ‌టంతో .. త‌ర్వాత క్రిష్ దర్శకత్వంలో ‘కొండ పొలం’ అనే సినిమా చేశాడు. అది బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇప్పుడు మూడో ప్ర‌య‌త్నంలో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ‘రంగ రంగ వైభవంగా’ సినిమాతో ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. టీజ‌ర్‌, ట్రైల‌ర్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాయి. ఈ చిత్రం ద్వారా గిరీశాయి ద‌ర్శ‌కుడిగా తెలుగులో డెబ్యూ మూవీ ఇది. మ‌రి ఈ చిత్రంతో వైష్ణ‌వ్ తేజ్ ఎలాంటి స‌క్సెస్ అందుకున్నాడు. అనే విష‌యాలు తెలియాలంటే సినిమా సమీక్ష లోకి వెళదాం.

కథ :
వైజాగ్ లో నివసించే రాముడు (ప్ర‌భు)..మరియు చంటి (వి.కె.న‌రేష్‌) మంచి స్నేహితులు. రాముడుకి ఒక కొడుకు అర్జున్ (న‌వీన్ చంద్ర‌) ఇద్ద‌రు కూతుర్లు. వాళ్ల‌లో రాధ చిన్న‌మ్మాయి (కేతికా శ‌ర్మ‌). ఇక చంటికి ఇద్ద‌రు కొడుకులు వారిలో చిన్న‌వాడు రిషి (పంజా వైష్ణ‌వ్ తేజ్‌). రిషి, రాధ ఇద్దరూ ఒకేరోజు పుడతారు, చిన్నప్పటి నుంచి కలిసే పెరుగుతారు, ఒకేలా ఆలోచిస్తారు. ఇద్ద‌రికీ ఒక‌రిపై ఒక‌రంటే ఇష్టం, ప్రేమ ఉన్న‌ప్ప‌టికీ భేషజం కార‌ణంగా మాట్లాడుకోరు. రాధా అన్న‌య్య అర్జున్.. రాజ‌కీయాల్లో యూత్ లీడ‌ర్‌గా కొన‌సాగుతుంటాడు. అదే స‌మ‌యంలో మినిష్ట‌ర్ (నాగ‌బాబు) కొడుకు త‌న స్నేహితుడైన కుర్రాడితో అర్జున్ పెద్ద చెల్లికి పెళ్లి చేసే ప్ర‌య‌త్నం చేస్తాడు. అప్పుడు ఆమె రిషి అన్న‌య్య‌ను ప్రేమిస్తుంద‌ని తెలుస్తుంది. మినిష్ట‌ర్ ముందు త‌న ప‌రువు పోయింద‌ని భావించిన అర్జున్ కోపంతో రిషి అన్న‌య్య‌ను కొడ‌తాడు. త‌న అన్న‌య్య‌ను కొట్టాడ‌ని రిషి కోపంతో అర్జున్‌ని కొడ‌తాడు. అలా రెండు కుటుంబాలు వేరు ప‌డ‌తాయి. ప‌దేళ్ల త‌ర్వాత ఒక్క‌టైన రిషి, రాధ మధ్య మ‌ళ్లీ దూరం పెరుగుతుంది. అప్పుడు వారిద్ద‌రూ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారు?.. రెండు కుటుంబాల‌ను క‌లిపే ప్ర‌య‌త్నంలో వారిద్ద‌రూ ఎలాంటి అడుగులు వేశారు? అనే విష‌యం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఆర్టిస్ట్స్ పెర్ఫార్మన్స్ :
హీరో వైష్ణ‌వ్ తేజ్‌ రిషి పాత్ర‌లో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశాడు. త‌న గ‌త రెండు చిత్రాల‌కు భిన్న‌మైన పాత్ర‌ను ఇందులో చేశాడు.ఈ సినిమాలో కొన్ని కామెడీ అండ్ లవ్ సీన్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. హీరోగా వైష్ణవ్ తేజ్ రిషి పాత్ర.. ఇక హీరోయిన్ గా నటించిన కేతిక శర్మ తన లుక్స్ తో ఆకట్టుకుంది. మరో కీలక పాత్రలో నటించిన నవీన్ చంద్ర నటన చాలా బాగుంది. కోపంతో, త‌న‌కు అవ‌మానం జ‌రిగింద‌ని ఫీల‌య్యే యువ‌కుడి పాత్ర‌లో త‌ను ఒదిగిపోయాడు. చ‌క్క‌గా చేశాడు. ఇక ప్ర‌భు, న‌రేష్, తుల‌సి, ప్ర‌గ‌తి పాత్ర‌లు తెర‌పై మ‌న‌కు క‌నిపిస్తాయి కానీ.. అంత‌గా ప్రాముఖ్య‌త లేని రోల్స్. సుబ్బ‌రాజు, మ‌ధుసూద‌న్‌, నాగ‌బాబు, యువ‌రాజ్‌, స‌త్య త‌దిత‌రులు వారి వారి పాత్ర‌ల పరిధుల మేర‌కు న‌టించారు. ఆ పాత్రకి సంబంధించిన లవ్ ట్రాక్, అలాగే ఆ పాత్రతో ముడి పడిన మిగిలిన పాత్రలు.. ఆ పాత్రల తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూస్.. ఇలా మొత్తానికి రంగ రంగ వైభవంగా కొన్ని చోట్ల ఆకట్టుకుంది.

సాంకేతికవర్గం :
సాంకేతికమ్ గా చూస్తే… దర్శకుడు గిరీశాయ ప్యూర్ లవ్ కి సంబంధించి మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు, కానీ.. ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా స్క్రీన్ ప్లేను రాసుకోలేదు. దర్శకుడు గిరీశాయ ఆకట్టుకునే విధంగా స్క్రీన్ ప్లేను రాసుకోలేకపోయారు. సంగీత దర్శకుడు దేవి అందించిన పాటల్లో రెండు బాగున్నాయి. ముఖ్యంగా హీరోహీరోయిన్ల మధ్య వచ్చే లవ్ సాంగ్ బాగుంది. అలాగే కొన్ని సన్నివేశాల్లో ఆయన అందించిన నేపధ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ జస్ట్ ఓకే అనిపిస్తుంది. బోర్ కొట్టించే కొన్ని సన్నివేశాలను ఎడిటర్ తన ఎడిటింగ్ తో మ్యానెజ్ చేయలేకపోయారు. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో దృశ్యాలన్నీ చాలా అందంగా చూపించారు. ఇక సినిమాలోని ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

విశ్లేషణ:
ఇలాంటి క‌థ‌ల‌ను తెలుగు ప్రేక్ష‌కులు ఇది వ‌ర‌కు చెప్పిన‌ట్లు చాలా సినిమాల్లో చూశారు. కాబ‌ట్టి కొత్త‌ద‌నం ఏమీ లేదు. అయితే ద‌ర్శ‌కుడు సినిమాను ఎంత అందంగా ముందుకు తీసుకెళ్లాడ‌నేదే చాలా ముఖ్యం. ఎంతో అన్యోన్యంగా ఉండే రెండు కుటుంబాలు. అందులో హీరో, హీరోయిన్ ఉంటారు. వారి మ‌ధ్య స్నేహం అనుకోకుండా కోపంగా మారుతుంది. ఆ కోపం క్ర‌మంగా ప్రేమ‌గా మారుతుంది. వారి కుటుంబాల మ‌ధ్య గొడ‌వ‌లు.. ఆ గొడ‌వ‌ల్లో హీరో హీరోయిన్ మ‌ధ్య పెరిగే దూరం.. త‌ర్వాత ఇద్ద‌రూ క‌లుసుకున్నార‌నే క‌థాంశంతో తెలుగులో బోలెడు సినిమాలు వ‌చ్చాయి. ఇక హీరో హీరోయిన్ మ‌ధ్య స్నేహం, గొడ‌వ‌లు, ప్రేమ‌.. అనే ఎలిమెంట్స్‌ను ఎన్నో చిత్రాల్లో చూశాం. రంగ రంగ వైభ‌వంగా కూడా అలాంటి స్టైల్‌లో రూపొందిన సినిమానే. మూవీ స్టార్ట్ అయిన ప‌దిహేను నిమిషాల‌కు అస‌లు క‌థేంటి? అనేది క్లియ‌ర్‌గా తెలిసిపోతుంది. అయితే సంఘ‌ర్ష‌ణ‌ను ఏ కోణంలో ద‌ర్శ‌కుడు తీసుకువ‌స్తాడ‌నే పాయింట్లో కాస్త కొత్త‌గానే ఆలోచించాడు. హీరోయిన్‌కి ఓ అన్న‌య్య పాత్ర‌ను క్రియేట్ చేసి.. త‌న‌కు ఓ పొలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్‌ను క్రియేట్ చేశాడు. దాని వ‌ల్ల వ‌చ్చే ఇబ్బందుల‌తో సినిమాను ముందుకు తీసుకెళ్లాడు. ఎమోషనల్ లవ్ స్టోరీలతో వచ్చిన ఈ ‘రంగ రంగ వైభవంగా’లో ల స్లో నేరేషన్, బోరింగ్ ట్రీట్మెంట్, రెగ్యులర్ సిల్లీ లవ్ డ్రామా వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. అయితే, లవర్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమాలోని కొన్ని అంశాలు పర్వాలేదు అనిపించొచ్చు. కానీ మిగిలిన వర్గాల ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా నచ్చదు.

Related Posts

Latest News Updates