కేరళ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన తొలి బాహుబలి నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను ప్రారంభించారు. అనంతరం ఈ విమాన వాహక నౌకను జాతికి అంకితం ఇచ్చారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ కేరళ తీరంలో ఈ రోజు నవశకం ప్రారంభమైందని తెలిపారు. అమృతోత్సవ వేళ ఐఎన్‌ఎస్ నౌక ప్రవేశం శుభపరిణామమన్నారు. భారతకు సాధ్యం కానిది ఏదీ ఉండదని, ఐఎన్‌ఎస్ విశ్రాంత్ నౌకను చూసి ప్రతి భారతీయుడు గర్వించాలని అన్నారు.
కాగా విక్రాంత్ నౌక 2023లో తూర్పు నౌకాదళ అమ్ములపొదిలో పూర్తిస్థాయిలో చేరే అవకాశముంది. ఐఎన్‌ఎస్ విక్రాంత్ నౌక గంటలకు 28 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించనుంది. దీనికి తయారీకి 13 ఏళ్ల సమయం పట్టగా రూ.20 వేల కోట్లు ఖర్చయ్యింది. 262 మీటర్ల పొడవు, 62 మీటర్ల వెడల్పు కలిగిన ఈ నౌక బరువు 37,500 టన్నులు. ఇందులో మొత్తం 14 అంతస్తులు, 2300 కాంపార్ట్‌మెంట్స్ ఉన్నాయి. విధుల్లో 1600 మంది సిబ్బంది ఉంటారు.