దేశంలో కరోనా కేసులు మెళ్లి మెళ్లిగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం అలర్ట్ అయ్యింది. ఇప్పటికే పలు రాష్ట్రాలకు కొన్ని సూచనలు కూడా చేసింది. అయితే… బూస్టర్ డోసు విషయంలో నేషనల్ టక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ కీలక సూచన చేసింది. కొన్ని రోజుల క్రితం తీసుకున్న రెండు డోసుల వ్యాక్సిన్ ల నుంచి పొందిన యాంటీబాడీలు కేవలం 6 నుంచి 8 నెలల్లోనే తగ్గిపోతాయని, అందుకే అందరూ వెంటనే బూస్టర్ డోస్ తీసుకోవాలని నేషనల్ టక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ చైర్మన్ డాక్గర్ ఎన్ కే అరోరా సూచించారు.
వీలైనంత తొందరగా అందరూ బూస్టర్ డోస్ తీసుకోవాలని కోరారు. ఇంకా కరోనా పూర్తిగా నయం కాలేదని, అందుకే అందరూ జాగ్రత్తగా వుండాలన్నారు. గడచిన ఎనిమిది నెలల్లో ఆస్పత్రి పాలైన రోగులెవ్వరూ కరోనా బూస్టర్ డోస్ తీసుకోని వారేనని, అందుకే ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ బూస్టర్ డోస్ తీసుకోవాలని, భవిష్యత్తులో అది ఇన్సూరెన్స్ గా పనిచేస్తుందని షనల్ టక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ చైర్మన్ డాక్గర్ ఎన్ కే అరోరా చెప్పుకొచ్చారు.