తెలుగు క్రైమ్ థ్రిల్లర్ “ది సస్పెక్ట్” మార్చి 21న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవలే సెన్సార్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రేక్షకులను కొత్త అనుభూతిని అందించనుంది.
రుషి కిరణ్, శ్వేత, రూప, శివ యాదవ్, రజిత, ఏ.కే.ఎన్. ప్రసాద్, మృణాల్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు రాధాకృష్ణ గర్నెపూడి దర్శకత్వం వహించారు. టెంపుల్ టౌన్ టాకీస్ బ్యానర్‌పై కిరణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం, ఒక హత్యను కేంద్రబిందువుగా చేసుకుని జరిగే కొత్త తరహా పరిశోధన కథగా రూపుదిద్దుకుంది.
సినిమాటోగ్రఫీని రాఘవేంద్ర, సంగీతాన్ని ప్రజ్వల్ క్రిష్, ఎడిటింగ్‌ను ప్రవీణ్ నిర్వహించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచిన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది.

“ది సస్పెక్ట్” చిత్రాన్ని ఎస్.కే.ఎమ్.ఎల్. మోషన్ పిక్చర్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో భారీగా విడుదల చేయనున్నారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ప్రేక్షకులకు థ్రిల్లింగ్ అనుభూతిని అందిస్తుందని నిర్మాత కిరణ్ కుమార్ తెలిపారు.