ఘనంగా హక్కు ఇనిషేటివ్ ‘మన హక్కు హైదరాబాద్’ కర్టెన్ రైజర్ ప్రచార గీతం విడుదల కార్యక్రమం*

ప్రజల, ప్రభుత్వ భాగస్వామ్యంతో సామాజిక చైతన్యాన్ని కలిగించే పలు కార్యక్రమాలు చేపడుతున్న హక్కు ఇనిషేటివ్ సంస్థ మన హక్కు హైదరాబాద్ కర్టెన్ రైజర్ ప్రచార గీతాన్ని శుక్రవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఆవిష్కరించింది. ఈ నెల 14వ తేదీ నుంచి జుబ్లీహిల్స్ లోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో వై డిమాలిషన్స్ ఇన్ హైదరాబాద్ అనే చర్చా కార్యక్రమాన్ని చేపట్టబోతోంది. ఈ చర్చా కార్యక్రమంలో పలువురు మేధావులు, పౌరుల పాల్గొంటారు. ఈ నేపథ్యంలో మన హక్కు హైదరాబాద్ కర్టెన్ రైజర్ ప్రచార గీతాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు కోటి, ఈ పాటను కంపోజ్ చేసిన సింగర్ అనుదీప్ దేవ్, దర్శకుడు యదు వంశీ, హక్కు ఇనిషేటివ్ డైరెక్టర్స్ రాహుల్ హేమ్నాని, అనూజ్ పార్థి, సంస్థ ప్రతినిధి వివేకానంద్, ప్రముఖ ఫిలిం జర్నలిస్టులు సురేష్ కొండేటి, ప్రభు, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో

జర్నలిస్ట్ సురేష్ కొండేటి మాట్లాడుతూ – మన హక్కు సాంగ్ ను లాంఛ్ చేసినందుకు కోటి గారికి థ్యాంక్స్. హైదరాబాద్ గురించి ఎంతో అవగాహన చేసుకుని ఈ పాట రాశారు. మ్యూజిక్, లిరికల్ పరంగా సాంగ్ అద్భుతంగా ఉంది. చాలా బాగా పాడారు. ఎంతోమందికి ఇన్సిపిరేషన్ కలిగించేలా పాట ఉండటం హ్యాపీగా ఉంది. అన్నారు.

జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ – హక్కు అని మాట్లాడిన ప్రతి చోటా బాధ్యత ఉంటుంది. హైదరాబాద్ నగరాన్ని శుభ్రంగా, ప్రశాంతంగా ఉంచుకునే బాధ్యత మనందరి మీదా ఉంది. ఇలాంటి మంచి కార్యక్రమంతో ముందుకు వచ్చిన హక్కు ఇనిషేటివ్ సంస్థకు నా అభినందనలు తెలుపుతున్నా. అన్నారు.

దర్శకుడు యదు వంశీ మాట్లాడుతూ- ఎన్నో మంచి కార్యక్రమాలతో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న హక్కు ఇనిషేటివ్ వారికి నా అభినందలు. మన వాయిస్ వినిపించేందుకు, మనకు సపోర్ట్ గా నిలిచేందుకు వారు చేస్తున్న ప్రయత్నం స్ఫూర్తికరంగా ఉంది. అన్నారు.

సింగర్, కంపోజర్ అనుదీప్ దేవ్ మాట్లాడుతూ – మన హక్కు హైదరాబాద్ కర్టెన్ రైజర్ సాంగ్ ను కంపోజ్ చేసే అవకాశం రావడం హ్యాపీగా ఉంది. ఈ పాటను కేవలం రెండు రోజుల్లోనే కంపోజ్ చేశాను. అందుకు నా మ్యూజిక్ టీమ్ ఎంతో సపోర్ట్ చేసింది. వారందిరికీ థ్యాంక్స్. ఈ పాట ద్వారా మరికొంత మంది ఇన్స్ పైర్ అయితే అదే ఎంతో సంతృప్తినిస్తుంది. అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ కోటి మాట్లాడుతూ – హక్కు ఇనిషేటివ్ గురించి ఇక్కడికి వచ్చిన వాళ్లు మాట్లాడుతుంటే తెలుసుకున్నా. సామాజిక చైతన్యాన్ని పంచే ఎన్నో గొప్ప కార్యక్రమాలు ఈ సంస్థ చేయడం హ్యాపీగా ఉంది. ఇది మన నగరం. మన ఇంటిని ఎలా శుభ్రంగా, బాగా ఉండేలా చూసుకుంటామో అలాగే మన నగరం బాగుండేలా చూసుకోవాలి. ఆ బాధ్యత మనందరి మీదా ఉంది. మన హక్కు హైదరాబాద్ చర్చా కార్యక్రమంలో పెద్ద ఎత్తున పౌరులు పాల్గొనాలి. ఈ స్ఫూర్తిని మనమంతా తీసుకోవాలని కోరుతున్నా. అన్నారు.

హక్కు ఇనేషేటివ్ డైరెక్టర్స్ రాహుల్ హేమ్నాజీ, అనూజ్ పార్థి, సంస్థ ప్రతినిధి వివేకానంద్, మాట్లాడుతూ – ఈ రోజు మన హక్కు హైదరాబాద్ కర్టెన్ రైజర్ ప్రచార గీతం విడుదల కార్యక్రమంలో పాల్గొన్న కోటి గారికి, ఇతర అతిథులకు థ్యాంక్స్. మా సంస్థ ద్వారా మాన్ సూన్ ప్రిపరెడ్నెస్, శానిటేషన్ వారియర్స్, సిటిజన్ సేఫ్టీ వంటి ఎన్నో సామాజిక చైతన్య కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ నెల 14న హైదరాబాద్ ఫిలినగర్ క్లబ్ లో వై డిమాలిషన్స్ ఇన్ హైదరాబాద్ టాపిక్ మీద చర్చా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఆ చర్చలో మీరంతా పాల్గొనాల్సిందిగా, మంచి ప్రచారం కల్పించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అన్నారు.

హక్కు ఇనిషియేటివ్ సంస్థ ప్రతినిధి వివేకానంద్ మాట్లాడుతూ మన హక్కు హైదరాబాద్ కార్యక్రమాన్ని, ప్రజలందరికీ చేరువ చేసి దీనిలో అందరూ భాగస్వాములు అవ్వాలని, ప్రచార గీతం నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా అందరికీ పంపించాలని, 9240023000 నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని తెలియజేశారు. సోషల్ మీడియా ద్వారా మన హక్కు హైదరాబాద్ ని మన బాధ్యతగా ప్రజలందరికీ తీసుకువెళ్లాలని కోరారు

Related Posts

Latest News Updates