హీరో అల్లరి నరేష్ రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బచ్చల మల్లి’గా రాబోతున్నారు. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 20న విడుదల కానుంది. తాజాగా మేకర్స్ ఈ చిత్రం థర్డ్ సింగిల్ – మరి అంత కోపం సాంగ్ ని రిలీజ్ చేశారు.
మరి అంత కోపం హీరో అంతర్గత సంఘర్షణ, పశ్చాత్తాపానికి గురిచేసే హార్ట్ టచ్చింగ్ నెంబర్. అల్లరి నరేష్ తన పాస్ట్ యాక్షన్స్, తప్పులు, అతని ఈగో, ఎడిక్షన్స్ యొక్క ప్రభావాన్ని ప్రశ్నిస్తూ అతని అంతర్గత సంఘర్షణను ఈ పాట ప్రజెంట్ చేస్తోంది.
పూర్ణా చారి రాసిన లిరిక్స్ హ్యూమన్ ఎమోషన్స్ ఇంపాక్ట్ ఫుల్ గా చూపించాయి. విశాల్ చంద్రశేఖర్ ఆర్కెస్ట్రేషన్, క్లాసిక్ కంపోజిషన్ మనసుని హత్తుకుంది. సాయి విఘ్నేష్ వోకల్స్ ట్రాక్ ఎమోషన్స్ ఎలివేట్ చేసే హానెస్టిని తీసుకొచ్చింది. అల్లరి నరేష్, అమృత అయ్యర్ పాటు ఇతర ప్రముఖ తారాగణాన్ని కూడా చూపించే ఈ సౌంగ్ ఇంటెన్స్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేసింది.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు, థర్డ్ సింగిల్ కూడా స్ట్రాంగ్ ఇంపాక్ట్ ని చూపింది.
రోహిణి, రావు రమేష్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరి తేజ, ప్రవీణ్, వైవా హర్ష తదితరులు ఈ చిత్రంలో ఇతర ముఖ్య తారాగణం.
మానాడు, రంగం, మట్టి కుస్తి వంటి చిత్రాలకు పని చేసిన రిచర్డ్ ఎమ్ నాథన్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్. బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
కథ, సంభాషణలను దర్శకుడు సుబ్బు మంగదేవి స్వయంగా రాశారు, స్క్రీన్‌ప్లేను విప్పర్తి మధు రాశారు, విశ్వనేత్ర అడిషినల్ స్క్రీన్‌ప్లే సహకారాన్ని అందించారు.
తారాగణం: అల్లరి నరేష్, అమృత అయ్యర్, రోహిణి, రావు రమేష్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరి తేజ, ప్రవీణ్, వైవా హర్ష తదితరులు.
సాంకేతిక సిబ్బంది:
కథ, మాటలు, దర్శకత్వం – సుబ్బు మంగదేవి
నిర్మాతలు – రాజేష్ దండా, బాలాజీ గుత్తా
బ్యానర్: హాస్య మూవీస్
స్క్రీన్ ప్లే: విప్పర్తి మధు
అడిషినల్ స్క్రీన్ ప్లే: విశ్వనేత్ర
సంగీతం- విశాల్ చంద్రశేఖర్
డీవోపీ- రిచర్డ్ M నాథన్
ఎడిటింగ్- ఛోటా కె ప్రసాద్
ప్రొడక్షన్ డిజైన్- బ్రహ్మ కడలి.
పీఆర్వో – వంశీ-శేఖర్
మార్కెటింగ్-ఫస్ట్ షో