గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ డిసెంబర్ 12న లాంచ్ చేయనున్న మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్, రోహిత్ కెపి, కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి, ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ #SDT18 కార్నేజ్‌

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ #SDT18 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. డెబ్యుటెంట్ రోహిత్ కెపి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. హనుమాన్ సెన్సేషనల్ పాన్ ఇండియా విజయం తర్వాత నిర్మాతలు కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పై ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను హై బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. #SDT18 ఇప్పటికే హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. “ఇంట్రూడ్ ఇంటు ది వరల్డ్ ఆఫ్ ఆర్కాడీ” గ్లింప్స్ సినిమా కోసం క్రియేట్ చేసిన అద్భుత ప్రపంచంలోకి స్నీక్ పీక్ ఇచ్చింది.

ఇప్పుడు, మేకర్స్ బిగ్ అప్‌డేట్‌తో వచ్చారు. #SDT18 కార్నేజ్ డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. యూసుఫ్‌గూడలోని శౌర్య కన్వెన్షన్ సెంటర్, పోలీస్ ఇండోర్ గ్రౌండ్స్‌లో జరిగే గ్రాండ్ ఈవెంట్‌లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ SDT18 కార్నేజ్‌ని లాంచ్ చేయనున్నారు. ఈ వేడుకకు రామ్ చరణ్ కూడా ముఖ్య అతిథిగా హాజరుకానుండడంతో ఇది మ్యాసీవ్ ఈవెంట్ గా ప్రేక్షకులను అలరించనుంది.

గ్లింప్స్ లో చూపిన విధంగా సాయి దుర్గ తేజ్ ఈ చిత్రంలో ఫస్ట్- అఫ్ ఇట్స్ కైండ్ పవర్ ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. మోస్ట్ ట్యాలెంటెడ్ ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటిస్తోంది.

తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలో పాన్-ఇండియా విడుదల కానున్న ఈ చిత్రానికి సెన్సేషనల్ కంపోజర్ బి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు.

తారాగణం: సాయి దుర్గ తేజ్, ఐశ్వర్య లక్ష్మి

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: రోహిత్ కె.పి
నిర్మాతలు: కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి
బ్యానర్: ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్
సంగీతం: బి అజనీష్ లోక్‌నాథ్
పీఆర్వో: వంశీ-శేఖర్

Related Posts

Latest News Updates