‘మెకానిక్ రాకీ’ అన్ ప్రిడిక్టబుల్ గా ఉంటుంది. ఆడియన్స్ ఖచ్చితంగా సర్ ప్రైజ్ అవుతారు: హీరో విశ్వక్ సేన్
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మెకానిక్ రాకీ’. డెబ్యుటెంట్ రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ మూవీని ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మించారు. ఫస్ట్ గేర్, ట్రైలర్స్, సాంగ్స్ తో సినిమా హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం నవంబర్ 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో విశ్వక్ సేన్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు. మెకానిక్ రాకీ కథలో మిమ్మల్ని ఎట్రాక్ట్ చేసిన ఎలిమెంట్ ఏమిటి ?
-గత నాలుగైదు ఏళ్ళుగా జరుగుతున్న ఒక బర్నింగ్ పాయింట్ ని ఈ సినిమాలో టచ్ చేశాం. అది స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు చాలా సర్ ప్రైజింగ్ గా ఉంటుంది. అసలు ఇంతకాలం ఈ పాయింట్ ఎవరు ఎందుకు టచ్ చేయలేదనిపిస్తుంది. గ్యాంగ్స్ అఫ్ గోదావరి, ఈ సినిమా రెండు ఒకే సమయంలో చేశాను. ఆ సినిమా చేస్తున్నప్పుడు ఒక చిన్న భయం ఉండేది. ఈ సినిమాలో మేము చెబుతున్న పాయింట్ తో ఇంకేదైనా సినిమా వస్తుందా అని ఒక చిన్న టెన్షన్ ఉండేది. కచ్చితంగా మెకానిక్ రాకీలో ఆ ఎలిమెంట్ కి ఆడియన్స్ సర్ ప్రైజ్ అవుతారు. ఈ సినిమాలో మేము మెసేజ్ ఇవ్వడం లేదు. అయితే కావాల్సిన వారు అందులో నుంచి మెసేజ్ ని తీసుకోవచ్చు.
-మెకానిక్ రాకీ సినిమా చాలా ఎంటర్ టైనింగ్ గా ఉంటుంది. సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి అడ్రినలిన్ రష్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ కి జోనర్ మారుతుంది. సెకండ్ హఫ్ మొదలైన పది నిమిషాల తర్వాత హై స్టార్ట్ అయిపోతుంది. ఫోన్ వస్తే కట్ చేసి జేబులో పెట్టుకునేంత మేటర్ వుంది. మేము ట్రైలర్ లో కథని పెద్దగా రివిల్ చేయలేదు. సినిమాలో చాలా కథ వుంది. అందరూ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది.
కొత్త దర్శకుడు రవితేజ ముళ్లపూడితో వర్క్ చేయడం గురించి ?
-రవితేజ చాలా స్మార్ట్ డైరెక్టర్. తను ఈ కథని తీయగలుగుతాడని బలంగా నమ్మాను. అద్భుతంగా తీశాడు. సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ ఫస్ట్ డైరెక్టర్, రైటింగ్ ని మెచ్చుకుంటారు.
-ఇది ట్రూ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని తీసిన సినిమా. ఆ ఇన్సిడెంట్స్ ఏమిటనేది ఆడియన్స్ కి తెలిసిపోతుంది. ఆడియన్స్ కనెక్ట్ అవుతారు.
జేక్స్ బిజోయ్ మ్యూజిక్ గురించి ?
-నేను ఇప్పుడే సినిమా చూసి వస్తున్నాను. బీజీఎం చింపేశాడు. మ్యూజిక్ అదిరిపోతుంది. పాటలన్నీ చాలా ఎంజాయ్ చేస్తారు.
ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ?
-ఇది అన్ ప్రిడిక్టబుల్ మూవీ. ఊహించని విధంగా వుంటుంది.
మీనాక్షి, శ్రద్దా గురించి చెప్పండి ?
-సినిమా లో నేను, మీనాక్షి, శ్రద్దా, నరేష్ గారు, రఘు, సునీల్, అన్నీ పాత్రలు ఈక్వెల్ ఇంపార్టెన్స్ తో ఉంటాయి. ఇది కేవలం హీరో డ్రివెన్ ఫిలిం కాదు. స్క్రీన్ ప్లే రేటింగ్ కి చాలా మంచి పేరు వస్తుంది.
-సునీల్ గారు నరేష్ గారితో ఒక మెమరబుల్ మూవీ చేయాలని ఎప్పటినుంచో వుండేది. అది ఈ సినిమాతో కుదిరింది. సునీల్, రఘు యాంటీ హీరో రోల్స్ చేస్తున్నారు.
నిర్మాత గురించి ?
-రామ్ తాళ్లూరి గారు చాలా ఓపికగా ఈ సినిమా చేశారు. గ్యాంగ్స్ అఫ్ గోదావరితో పాటుగా ఈ సినిమా చేశాను. మధ్యలో చాలా వెయిటింగ్ పిరియడ్ వచ్చింది. ఈ ప్రాసెస్ లో నాకు చాలా సపోర్ట్ చేశారు. ఆయన ఓపిక కారణంగానే ఇంత మంచి ప్రాడక్ట్ వచ్చింది.
-డబుల్ పాజిటివ్ చుసుకున్నప్పుడే ప్రిమియర్స్ పెట్టాలని అనుకున్నాను. ఈ రోజు చూసింది ఎన్ని ప్రిమియర్స్ పెట్టాలని. చూసిన తర్వాత ఎన్ని షోస్ అయిన పెట్టొచ్చనిపించింది.
‘మంచి క్వశ్చన్ కొట్టు.. గోల్డ్ కాయిన్ పట్టు’ ఈ ఐడియా ఎలా వచ్చింది ?
-రెగ్యులర్ గా కాకుండా కాస్త ప్యాట్రన్ బ్రేక్ చేయాలనిపించింది. పార్టీలోనే ప్రెస్ మీట్ చేసుకుంటున్నాం కదా అందరం ఒక టేబుల్ దగ్గర కూర్చుని జోవియల్ గా మాట్లాడాలనిపించింది. అలా మాట్లాడినప్పుడు మంచి క్వశ్చన్ కి గోల్డ్ కాయిన్ ఇవ్వాలనే ఆలోచన వచ్చింది. మంచి క్వశ్చన్ ఏమిటనేది నాకూ తెలీదు.(నవ్వుతూ). ఐడియా నాకు వచ్చింది. మిగిలింది మీరు ముందుకు తీసుకువెళ్ళాలి.(నవ్వుతూ)
కొత్త సినిమాల గురించి ?
-లైలా 60 పర్సెంట్ కంప్లీట్ అయ్యింది. సుధాకర్, అనుదీప్ గారి సినిమాలు ప్యార్లల్ గా జరుగుతాయి. కల్ట్ మార్చ్ లో మొదలుపెడతాం. ఏమైయింది నగరానికి 2 రైటింగ్ జరుగుతోంది.
ఆల్ ది బెస్ట్
-థాంక్ యూ