పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చైతు జొన్నలగడ్డ, రాజ్ విరాట్ ‘మోసెస్ మాణిక్‌చంద్ పార్ట్-2’ టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల చేసిన నేచురల్ స్టార్ నాని

నటుడు సిద్ధు జొన్నలగడ్డ అన్న చైతు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో #MM పార్ట్-2ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఇది వరకే ప్రకటించారు. విజనరీ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇది వరకు విడుదల చేసిన ప్రీ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్‌ను లాంచ్ చేశారు.

చైతు ఈ చిత్రానికి ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా, కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్‌ను కూడా అందించారు. ఈ చిత్రానికి బొమ్మ బ్లాక్ బస్టర్ ఫేమ్ రాజ్ విరాట్ దర్శకత్వం వహించనున్నారు. నేడు (నవంబర్ 14) నేచురల్ స్టార్ నాని సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించి, టీమ్‌కి శుభాకాంక్షలు తెలిపారు.

మోసెస్ మాణిక్‌చంద్‌ పార్ట్‌-2 అనే టైటిల్‌తో రాబోతోన్న ఈ చిత్రం డిఫరెంట్‌గా ఉండబోతోందని పోస్టర్‌ను చూస్తేనే తెలుస్తోంది. ఈ పోస్టర్‌లో మద్యం బాటిల్, క్లాప్‌బోర్డ్, అమ్మాయి, వైన్ గ్లాస్ ఇలా అన్నీ కనిపిస్తున్నాయి. పైగా ఈ చిత్ర పోస్టర్‌ను చిల్డ్రన్స్ డే సందర్భంగా రిలీజ్ చేస్తూ.. హ్యాపీ ‘నో చిల్డ్రెన్స్’ డే అని పెట్టారు. దీంతో మరింత ఆసక్తికరంగా మారింది.

చైతు జొన్నలగడ్డ ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రాజకుర్చీపై రాజసం ఉట్టి పడేలా కూర్చుండగా.. భారీ ఆభరణాలు, స్టైలిష్ హెయిర్, లేత గడ్డం, సన్ గ్లాసెస్‌తో డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఒంటిపై ఆ టాటూలు పాత్ర తీరు, స్వభావాన్ని సూచించేలా ఉన్నాయి.

ఈ మూవీకి పెట్టిన ట్యాగ్‌లైన్ ‘ఎ రియల్ విలన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దేన్ ఎ ఫేక్ హీరో’ కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా ఉంది. పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉండబోతోంది. ఈ ప్రాజెక్ట్‌కి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా, కృతి ప్రసాద్ క్రియేటివ్ ప్రొడ్యూసర్. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.

Related Posts

Latest News Updates