‘జాతర’ పెద్ద విజయం సాధించి మంచి లాభాల్ని తెచ్చి పెట్టాలి.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శివ బాలాజీ

సతీష్ బాబు రాటకొండ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన సినిమా ‘జాతర’. దీయా రాజ్ హీరోయిన్ గా నటించారు. ఈ చిత్రాన్ని గల్లా మంజునాథ్ సమర్పణలో మూవీటెక్ ఎల్‌ఎల్‌సితో కలిసి రాధాకృష్ణ ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రాధాకృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి నిర్మించారు. ఇంత వరకు ఎవ్వరూ టచ్ చేయని పాయింట్‌తో రగ్డ్‌గా, ఇంటెన్స్ డ్రామాతో ‘జాతర’ తెరకెక్కింది. చిత్తూరు జిల్లా బ్యాక్ డ్రాప్‌లో జరిగే జాతర నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 8న థియేటర్లోకి రాబోతోంది. ఈ క్రమంలో జాతర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను సోమవారం నాడు నిర్వహించారు.

సతీష్ బాబు మాట్లాడుతూ.. ‘యథార్థ సంఘటనల ఆధారంగా ఈ కథ రాశాను. నిర్మాతలకు ఈ పాయింట్ చెప్పినప్పుడు వాళ్లకి చాలా నచ్చింది. 2016లో కథ స్టార్ట్ చేశాను. మధ్యలో కరోనా వచ్చింది. ఆ తరువాత ఇంకాస్త టైం తీసుకుని జాతర చిత్రాన్ని చేశాం. ఊరి కట్టుబాట్లు, ఆ తంతులు, అందులో జరిగే ఘటనల గురించి చూపించాం. ఈ చిత్రానికి నిర్మాతలు బ్యాక్ బోన్‌లా నిలబడ్డారు. నటుడిగా, దర్శకుడిగా ఇది నాకు మొదటి సినిమా. నేను అడిగిన విజువల్స్, ఫ్రేమింగ్స్ ఇచ్చిన కెమెరామెన్ ప్రసాద్ గారికి థాంక్స్. పది మంది ఎమోషన్స్‌ను సింగిల్ కారెక్టర్‌లో చూపించిన ఆర్కే నాయుడు గారికి థాంక్స్. హీరోయిన్ దీయా గారు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతారు. సినిమాకు పని చేసిన ఆర్టిస్టులకి అందరికీ థాంక్స్. నవంబర్ 8న రాబోతోన్న మా చిత్రాన్ని అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.

ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. ‘మేం మా ఊర్లో గుడి కట్టించాం. అక్కడ ఉన్న దేవత విగ్రహాన్ని కదల్చాలని అనుకున్నాం. కానీ వద్దని అంతా వారించారు. ఈ జాతర మూవీ కాన్సెప్ట్ కూడా అదే. మంచి కథ ఉంటే.. హీరో, దర్శకుల గురించి జనాలు అంతగా పట్టించుకోరు. కొత్తగా వచ్చిన సతీష్ హీరో, రైటర్, డైరెక్టర్ అయ్యాడు. రిషభ్ శెట్టిలా పెద్ద హీరో, పెద్ద దర్శకుడు కావాలని కోరుకుంటున్నాను. ట్రైలర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

శివ బాలాజీ మాట్లాడుతూ.. ‘జాతర ట్రైలర్‌ను చూశాను. చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. హీరో, దర్శకుడు సతీష్ బాబుకు ఆల్ ది బెస్ట్. ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవ్వాలి. నిర్మాతలకు మంచి లాభాలు రావాలి’ అని అన్నారు.

ధృవ వాయు మాట్లాడుతూ.. ‘కంటెంట్‌తో వచ్చే చిన్న చిత్రాలే ఎక్కువగా సక్సెస్ అవుతున్నాయి. మెల్లిగా అయినా కూడా జనాలు థియేటర్‌కు వస్తున్నారు. జాతర టీజర్, ట్రైలర్‌ను చూశాను. నాకు చాలా నచ్చింది. సతీష్ బాబుకు ఆల్ ది బెస్ట్. నిర్మాతకు మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను. నవంబర్ 8న మాస్ జాతరను చేయాలి’ అని అన్నారు.

విశ్వ కార్తికేయ మాట్లాడుతూ.. ‘జాతర మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు నన్ను పిలిచిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. కలియుగం పట్టణంలో మూవీని థియేటర్లోకి తీసుకు రావడానికి మేం చాలా కష్టపడ్డాం. సతీష్ బాబు లాయర్, సైంటిస్ట్ అని తెలుసుకున్నా. సతీష్ ఈ మూవీకి రైటర్, హీరో మరియు దర్శకుడు. జాతర ట్రైలర్ చూశాను. నాకు చాలా నచ్చింది. అందరూ ఈ మూవీని చూసి పెద్ద హిట్ చెయ్యాలి’ అని అన్నారు.

నిర్మాత శివ శంకర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘సతీష్ గారితో నాకు పదేళ్ల నుంచి బంధం ఉంది. ఆయన చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. సినిమా బాగా వచ్చింది. టెక్నికల్ టీం చాలా కష్టపడింది. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికి థాంక్స్’ అని అన్నారు.

దీయా రాజ్ మాట్లాడుతూ.. ‘నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. నన్ను ఇంత బాగా చూపించిన కెమెరామెన్ గారికి థాంక్స్. ఇప్పుడు చిన్న చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయి. వాటిని అందరూ ఆదరిస్తున్నారు. నవంబర్ 8న రాబోతోన్న మా సినిమాని కూడా చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

Related Posts

Latest News Updates