యంగ్ అండ్ ప్రామెసింగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘తిరగబడరసామీ’. మాల్వి మల్హోత్రా కథానాయికగా నటిస్తోంది. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యూత్ ని ఆకట్టుకునే రోమాన్స్ తో పాటు ఫ్యామిలీని ఆకర్షించే సెంటిమెంట్, మాస్ ని అలరించే హై వోల్టేజ్ యాక్షన్, ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు మంచి బజ్ క్రియేట్ చేసి సినిమాపై క్యురియాసిటీని పెంచాయి. ఈ చిత్రం ఆగస్ట్ 2న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపధ్యంలో నిర్మాత మల్కాపురం శివకుమార్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.
‘తిరగబడరసామీ’ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలైయింది ?
– ఈ ప్రాజెక్ట్ 2023లో స్టార్ట్ అయ్యింది. డైరెక్టర్ ఎ ఎస్ రవికుమార్ గారు కథ చెప్పగానే నచ్చింది. సింగిల్ సిట్టింగ్ లో ఓకే చేశాను. ఈ కథకు రాజ్ తరుణ్ యాప్ట్ గా ఉంటుందని ముందే అనుకున్నాం.
రాజ్ తరుణ్ క్లాస్ గా వుంటారు కదా.. ఇందులో వైలెన్స్ కనిపిస్తోంది ?
-ఎవరైనా సిట్యుయేషన్ బట్టే బిహేవ్ చేస్తారు. సైలెంట్ గా వున్న పర్సన్ ని వైలెంట్ గా మార్చేది సిట్యుయేషనే. ఈ కథలో కూడా అలాంటి సిట్యుయేషన్ వుంటుంది. ఒక మామూలు కుర్రాడిని తన లైఫ్ లో వచ్చే సిట్యుయేషన్స్ ఎలా మార్చాయనేది చాలా ఆసక్తికరంగా వుంటుంది. కథని ప్రకారమే వైలెన్స్ వుంటుంది. రాజ్ తరుణ్ చాలా అద్భుతంగా పెర్ఫార్ చేశారు.
మీ మూవీ జర్నీ గురించి ?
– శ్రీహరి గారి ప్రోద్బలంతో భద్రాది సినిమాతో పరిశ్రమలోకి వచ్చాను. డైరెక్టర్ బాబీ కూడా ఆ సినిమాతోనే రైటర్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈ సినిమా తర్వాత డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేయడం జరిగింది. ప్రతి సినిమాలో కొత్తవారిని పరిచయం చేయాలని ఉద్దేశం నాది. బాబీ తో పాటు సూర్య vs సూర్యలో కార్తిక్ ఘట్టమనేని ని పరిచయం చేయడం జరిగింది. త్రిధ చౌదరి అనే ఓ కొత్త అమ్మాయిని హీరోయిన్ గా పరిచయం చేశాం. ఈ సినిమాతో మాల్వి మల్హోత్రా హీరోయిన్ పరిచయం అవుతుంది. మరో కొత్త దర్శకుడితో కూడా సినిమా చేస్తున్నాం.
‘తిరగబడరసామీ’ ఎలా వుండబోతుంది ?
-భార్య భర్తలు మూడు ముళ్ళ బంధానికి ఏ విధంగా కట్టుబడి ఉండాలనడానికి నిదర్శనం ఈ సినిమా. కంటెంట్ చాలా బావుంటుంది. అందరికీ నచ్చుతుంది.
మన్నారా చోప్రా క్యారెక్టర్ ఎలా వుంటుంది ?
-ఇందులో మన్నారా నెగిటివ్ ఫీమేల్ లీడ్ చేస్తుంది. సినిమా అంతా వుంటుంది. ఈ పాత్రకు తనకు యాప్ట్. ఆ పాత్రని చాలా అద్భుతంగా పోషించింది.
‘తిరగబడరసామీ’ ఎలాంటి అనుభవాన్ని ఇచ్చింది ?
-ఈ సినిమా షూటింగ్ దాదాపుగా జహీరాబాద్ లోనే చేశాం. అది మా నేటివ్ ప్లేస్. ప్రతి రోజు షూటింగ్ లో దాదాపు నాలుగు వందల మంది వుండేవారు. చాలా సరదాగా హోమ్లీగా జరిగింది.
డైరెక్టర్ ఎ ఎస్ రవికుమార్ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
– రవికుమార్ గారు చాలా హార్డ్ వర్క్ చేశారు. చెప్పినదాని కంటే అద్భుతంగా తీశారు. చాలా కోపరేట్ చేశారు. వెరీ గుడ్ డైరెక్టర్.
సినిమా చాలా లావిష్ గా తీసినట్లుగా కనిపిస్తోంది,, బిజినెస్ పరంగా వర్క్ అవుట్ అయ్యిందా ?
-చాలా బాగా వర్క్ అవుట్ అయ్యింది. అందుకే చాలా హ్యాపీగా రిలీజ్ చేస్తున్నాం.
నిర్మాతగా మీ జర్నీ చూసుకుంటే ఎలా అనిపిస్తుంది ?
– శ్రీహరి గారి ద్వారా సినిమా అంటే ఇష్టంతో వచ్చాను. నిర్మాతగా ఇక్కడ సంపాదించింది ఏమీ లేదనే చెప్పాలి. అయితే మనం బ్రతుకుతూ పదిమందిని బ్రతకించే ఏకైక పరిశ్రమ ఇది. చాలా ఎంప్లామెంట్ ని క్రియేట్ చేయొచ్చు. సినిమా సక్సెస్ అయితే దీనిపై ఆధారపడిన ఎన్నో జీవితాలు బావుంటాయి. సినిమాకి బ్రేక్ ఈవెన్ వస్తే.. మరో నలుగురికి అవకాశం ఇవ్వొచ్చు. మరో నలుగురిని పరిచయం చేయొచ్చు. అందుకే కనీసం బ్రేక్ ఈవెన్ ని ఆశిస్తాం.
బాలీవుడ్ లో చేస్తున్న ప్రాజెక్ట్స్ గురించి ?
-బాలీవుడ్ చేస్తున్న కథ చాలా నచ్చింది, నా స్నేహితుడు రాజ్ డైరెక్షన్ చేస్తున్నారు. ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ లో స్టేజ్ లో వుంది. అలాగే రాహు కేతు అనే వెబ్ సిరిస్ కూడా చేస్తున్నాం. అలాగే తిరుపతి బాలాజీపై ఒక వెబ్ సిరిస్ చేస్తున్నాం.
న్యూ ప్రాజెక్ట్స్ గురించి ?
-జేడీ చక్రవర్తి ,నరేష్ అగస్త్య, సీరత్ కపూర్ తో ఓ సినిమా జరుగుతోంది. ఈ సినిమా శ్రవణ్ అనే దర్శకుడుని పరిచయం చేస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
-థాంక్ యూ.