ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఈ పోటీ ప్రపంచంలో తనకు నచ్చింది కాకుండా తల్లిదండ్రుల ఇష్టానుసారంగా చదివి వాళ్ల సపోర్ట్ గానీ నమ్మకం గాని తమ పిల్లల పైన లేనప్పుడు ఈ సమాజంలో ఆ యువకుడు పడే తపన బాధ చాలా బాగా చూపించిన షార్ట్ ఫిలిం ‘ఏ వారియర్’. పేరెంట్స్ సపోర్ట్ చేసి తమ పిల్లలు చేసే పని పై నమ్మకం ఉంచితే ఏదైనా సాధిస్తారు అని చాలా బాగా చూపించారు.
రిలీజ్ పోస్టర్ యూట్యూబ్ ఛానల్ లో ఐ సునీల్ కుమార్ నిర్మాతగా తిరుమలేష్ బండారు కథ దర్శకత్వం చేసి ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చిన ‘ఏ వారియర్’ షార్ట్ ఫిలిం. ప్రస్తుత సమాజంలో ఉన్న సమస్యను చాలా బాగా చూపించారు. తనకు నచ్చింది కాకుండా తన తల్లిదండ్రులకు నచ్చిన కోర్సు చేసిన యువకుడు సమాజంలో ఎలా నలిగిపోతున్నారు అనే పాత్రలో రవి తేజ(రవి డి సామ్రాట్) ఆ యువకుడు ఆవేదన ను అర్థం చేసుకుని సపోర్ట్ చేసే తల్లి పాత్రలో వై. ధనలక్ష్మి బాగా నటించారు. తల్లి పాత్రలో నటించిన ధనలక్ష్మి గారి నటనకు మంచి స్పందన లభిస్తోంది. కథకు సిచువేషన్ కి తగినట్టుగా దేవి పసుపులేటి గారు అందించిన మ్యూజిక్ బాగుంది. 10నిమిషాలు నిడివి గల ఈ షార్ట్ ఫిలిం ప్రస్తుత సమాజానికి తగినట్టుగా ఈ కాలం తల్లిదండ్రులను ఆలోచింపజేసే విధంగా ఉంది. స్టార్టింగ్ కొంచెం లాగ్ అనిపించిన డైలాగ్స్ మొదలైనప్పుడు ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు. కచ్చితంగా ఈ తరం యువత పేరెంట్స్ చూడాల్సిన షార్ట్ ఫిలిం ‘ఏ వారియర్’.