ఇజ్జత్ టైటిల్ పోస్టర్ విడుదల
సన్నిహిత్ ఆర్ట్స్ ప్రొడక్షన్ మరియు బ్రెయిన్ వాష్ సినిమా పతాకంపై నటి లావణ్య ప్రధాన పాత్రలో ఉపేంద్ర ఎస్ పి దర్శకత్వం లో శ్రీను కందుల నిర్మిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ చిత్రం “ఇజ్జత్”. షూటింగ్ అంత పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలలో బిజీ గా ఉంది. అయితే ఈ రోజు ఈ చిత్రం యొక్క టైటిల్ పోస్టర్ ను దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి గారు విడుదల చేశారు.
అనంతరం దర్శకుడు ఉపేంద్ర ఎస్ పి మాట్లాడుతూ “మా ఇజ్జత్ చిత్రం ఒక మధ్యతరగతి అమ్మాయి కథ. ప్రేమ పెళ్లి ని వ్యతిరేకించి, పరువు పేరుతో ఓ కుటుంబం తమ కూతురి ప్రాణాలు తీయడానికి సిద్ధం అయితే, ఆ ఆడపిల్ల తిరగబడితే ఎలా ఉంటుందో తెలియపరిచే చిత్రమే ఇజ్జత్. పరువు హత్య ల మీద వచ్చిన చిత్రాలకంటే మా చిత్రం భిన్నంగా ఉంటుంది. కొత్త కథనం తో మంచి క్వాలిటీ విజువల్స్ తో మా చిత్రాన్ని నిర్మిస్తున్నాము. ఫస్ట్ కాపీ రెడీ అవుతుంది. త్వరలో విడుదల చేస్తాం” అని తెలిపారు.