వీర‌మ‌ల్లు కోసం ప‌వ‌న్ 25 రోజులిస్తే చాల‌ట‌

మొన్న‌టివ‌ర‌కు రాజ‌కీయాల్లో బిజీ బిజీగా గ‌డిపిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోసం సినీ ఇండ‌స్ట్రీ, ఫ్యాన్స్ ఎంత‌గానో వెయిట్ చేస్తున్నాడు. ప‌వ‌న్ ఎప్పుడెప్పుడు మేక‌ప్ వేసుకుని త‌మ సినిమాల‌ను పూర్తి చేస్తాడా అని నిర్మాతలు ఆశ‌గా ఎదురుచూస్తున్నారు. ప‌వ‌న్ కోసం మూడు సినిమా టీమ్స్ వేయి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నాయి. ప‌వ‌న్ మొద‌టిగా ఓజి సినిమాను పూర్తి చేస్తాడంటున్నారు.

ఓజితో పాటూ ప‌వ‌న్ హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు, ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ కూడా పూర్తి చేయాల్సి ఉంది. ఈ చిత్ర నిర్మాత‌లు కూడా ప‌వ‌న్ కోసం చూస్తున్నారు. అయితే ఆర్థికంగా వీర‌మ‌ల్లు ఎన్నో ఏళ్ల నుంచి మేకింగ్ ద‌శ‌లోనే ఉంది. దీంతో నిర్మాత ఏఎం ర‌త్నంకు ఆర్థికంగా భారం బాగా ఎక్కువైంది. వ‌డ్డీల భారం బాగా పెరిగి, బ‌డ్జెట్ కూడా పెరిగిపోయినా ప‌వ‌న్ కు ఉన్న క‌మిట్మెంట్స్ ను దృష్టిలో ఉంచుకుని ఆయ‌న కూడా సైలెంట్ గా ఉన్నాడు.

అంతేకాదు, ఎల‌క్ష‌న్స్ టైమ్ లో కూడా ఏఎం ర‌త్నం జ‌న‌సేన కోసం వ‌ర్క్ చేశాడు. దీంతో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లుకు ప‌వ‌న్ త్వ‌ర‌లోనే డేట్స్ ఇచ్చే ఛాన్సుందంటున్నారు. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో వీర‌మ‌ల్లుకు సంబంధించిన షూటింగ్ మ‌రో 25 రోజులు మాత్ర‌మే బ్యాలెన్స్ ఉంద‌ని, అవ‌న్నీ కూడా ప‌వ‌న్ ఉండాల్సిన సీన్సేన‌ని చెప్పాడు ఏఎం ర‌త్నం. అంటే ప‌వ‌న్ వీర‌మ‌ల్లు కోసం 25 రోజులు డేట్స్ ఇస్తే చాలన్న‌మాట ఆ సినిమా పూర్తైపోయి నిర్మాత ర‌త్నం చెప్పిన‌ట్లే ఈ ఏడాది ఆఖ‌రిలో సినిమా ప్రేక్ష‌కుల ముందుకొస్తుంది.

Related Posts

Latest News Updates