యాక్సిడెంట్ నుంచి కోలుకున్నాక సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ రెండు సినిమాలు చేశాడు. అందులో విరూపాక్ష బ్లాక్ బస్టర్ హిట్ అవగా, బ్రో సినిమా మాత్రం ఓ మోస్తరు ఫలితాన్నిచ్చింది. బ్రో సినిమా రిలీజ్ తర్వాత కొన్ని నెలల పాటు రెస్ట్ తీసుకున్నాడు తేజూ. తనకు ఇంకా కొన్ని ఆరోగ్య సమస్యలున్నాయని, వాటి నుంచి కోలుకునేందుకు కొంత టైమ్ కావాలని చెప్పి సినిమాల నుంచి గ్యాప్ తీసుకున్నాడు.
కానీ తేజూ చెప్పిన దానికంటే ఎక్కువ టైమే తీససుకున్నాడు. ఇప్పటికే తేజూ సంపత్ నంది దర్శకత్వంలో గాంజా శంకర్ చేయాల్సింది కానీ బడ్జెట్ సమస్యల వల్ల ఆ సినిమా హోల్డ్ లో ఉంది. కొంతమందైతే గాంజా శంకర్ ఆగిపోయిందంటున్నారు. ఇప్పుడు తేజూ కూడా గాంజా శంకర్ గురించి ఏం మాట్లాడకుండా తన కొత్త సినిమాను అనౌన్స్ చేస్తున్నాడు.
హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి బ్యానర్ లో రోహిత్ అనే కొత్త దర్శకుడితో ఓ సినిమాను ఇప్పటికే అనౌన్స్ చేయనున్నట్లు ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేశారు. కానీ పర్సనల్ ఎమర్జెన్సీ వల్ల ఈ అనౌన్స్మెంట్ ఆగిపోయిందని ప్రైమ్ షో సంస్థ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ రానుందని తెలిపారు. తేజూ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని, ఇప్పటివరకు తేజూ చేయని జానర్ లో ఈ సినిమా రూపొందనుందని తెలుస్తోంది.