వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ చేస్తున్నవన్నీ భారీ బడ్జెట్ సినిమాలే. ప్రభాస్ చేతిలో 5 సినిమాలుంటే అందులో లో బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా అంటే రాజా సాబ్. రూ.150 కోట్ల బడ్జెట్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ తాజాగా హైదరాబాద్ లో స్టార్ట్ అయింది.
ఈ షెడ్యూల్ లో ప్రభాస్ తో పాటూ హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా పాల్గొంటుంది. వారిద్దరికీ సంబంధించిన కీలక అంశాలను ఈ షెడ్యూల్ లో షూట్ చేస్తున్నారట. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి తాజాగా నెట్టింట ఓ టాక్ ప్రచారంలోకి వచ్చింది. త్వరలోనే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని నెట్టింట వినిపిస్తోంది.
అయితే రాజా సాబ్ ఫస్ట్ సింగిల్ కు సంబంధించి నెట్టింట వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని చిత్ర యూనిట్ చెప్తుంది. ప్రస్తుతం మారుతి ఫోకస్ అంతా చిత్ర షూటింగ్ పైనే ఉందని, దానికి తోడు కల్కి రిలీజ్ అయ్యేవరకు రాజా సాబ్ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ ఉండవని తెలుస్తోంది. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను మొదలు పెట్టాలని మారుతి చూస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి రాజా సాబ్ ను రిలీజ్ చేయాలని మేకర్స్ టార్గెట్ గా పెట్టుకున్నట్లు సమాచారం.