అంచ‌నాల‌ను మించుతున్న క‌న్న‌ప్ప బ‌డ్జెట్

ఒక్క సినిమాతో కెరీర్ ముందుకా వెనక్కా అన్న‌ది తేల్చేయాల‌నే నెపంతో మంచు విష్ణు క‌న్న‌ప్ప అనే సినిమాను చేస్తున్నాడు. త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెర‌కెక్కుతున్న ఈ సినిమాను ముందుగా రూ.100 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మించాల‌నుకున్నారు కానీ రోజురోజుకీ బ‌డ్జెట్ పెరుగుతూ వ‌స్తుంది. ముఖేష్ కుమార్ గౌడ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో భారీ తారాగ‌ణం సినిమాపై క్రేజ్ ను మ‌రింత పెంచుతుంది.

క‌న్న‌ప్ప‌లో ప్ర‌భాస్ న‌టిస్తున్నాడ‌న్న విష‌యం తెలిసినప్ప‌టి నుంచి డార్లింగ్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ప్ర‌భాస్ క‌టౌట్ ను స‌రిగా వాడుకుంటే ఓపెనింగ్స్ కు త‌నొక పెద్ద కార‌ణ‌మ‌య్యే ఛాన్స్ ఉంటుంది. ప్ర‌భాస్ కాకుండా శివ‌రాజ్ కుమార్, మోహ‌న్ లాల్, అక్ష‌య్ కుమార్ కూడా ఈ సినిమాలో కీల‌క పాత్ర‌ల్లో క‌నిపిస్తున్నారు. https://cinemaabazar.com/

ఈ స్టార్ క్యాస్టింగ్ మొత్తాన్ని స‌రిగ్గా వాడుకుంటే క‌న్న‌ప్ప నెక్ట్స్ లెవెల్ క్రేజ్ ను సొంతం చేసుకోవడం ఖాయం. క్యాస్టింగ్ వ‌ల్ల బ‌డ్జెట్ పెరుగుతున్న‌ప్ప‌టికీ మంచు విష్ణు ఎక్క‌డా రాజీ ప‌డ‌టం లేద‌ని తెలుస్తోంది. ఏదేమైనా ఈ క్యాస్టింగ్ ను చూస్తుంటే మాత్రం క‌న్న‌ప్ప ను త‌క్కువ అంచ‌నా వేయ‌డానికి వీల్లేద‌ని అర్థ‌మ‌వుతుంది. మ‌రి కెరీర్ ఫామ్ లో లేని టైమ్ లో విష్ణు చేస్తున్న ఈ ప్ర‌యోగం త‌న‌కు ఎలాంటి ఫ‌లితాన్నిస్తుందో చూడాలి.  

Related Posts

Latest News Updates