ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర మలయాళ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. చిన్న సినిమాలుగా రిలీజైన మలయాళ సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలుస్తున్నాయి. అంతేకాదు వేరే భాషల్లోకి కూడా రిలీజై మంచి కలెక్షన్స్ సాధిస్తున్నాయి. అలాంటి ఓ మలయాళ సినిమా ఇప్పుడు తెలుగులో రీమేక్ కానుందన్న విషయం చర్చనీయాంశంగా మారింది. https://cinemaabazar.com/
2022లో రిలీజైన జయ జయ జయహే సినిమాను ఇప్పుడు తెలుగులోకి రీమేక్ చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ మలయాళ రీమేక్ లో డైరెక్టర్ తరుణ్ భాస్కర్ హీరోగా నటించబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. దూత వెబ్ సిరీస్ లో తన నటనతో అందరినీ మెప్పించిన తరుణ్, ఇప్పుడు జయ జయ జయమే రీమేక్ లో ప్రధాన పాత్రలో నటించడానికి రెడీ అవుతున్నాడట.
ఆ సినిమా ఒరిజినలో లో నటించిన బాసిల్ జోసెఫ్ కూడా డైరెక్టరే కావడం గమనార్హం. గోధా సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన బాసిల్, ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించాడు. కానీ తరుణ్ భాస్కర్ ఇప్పటివరకు మీకు మాత్రమే చెప్తా సినిమాలో మాత్రమే హీరోగా నటించాడు. జయ జయ జయహే సినిమాలో తరుణ్ నటించాలంటే ఆ సినిమా కోసం తనెంతో కష్టపడాల్సి ఉంటుంది. ఈ సినిమా ఒరిజినల్ లో నటించిన దర్శన రాజేంద్రన్ ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించనున్నట్లు తెలుస్తోంది. https://cinemaabazar.com/