బాల‌య్య సినిమాలో మ‌రో స‌ర్‌ప్రైజ్

అఖండ‌, వీరసింహా రెడ్డి, భ‌గ‌వంత్ కేస‌రి సినిమాలతో హ్యాట్రిక్ కొట్టిన నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం బాబీ కొల్లి ద‌ర్శక‌త్వంలో భారీ మాస్ అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ ను చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్రేజీ కాంబో మీద భారీ అంచ‌నాలున్నాయి. అంచ‌నాల‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా బాబీ ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నాడు. https://cinemaabazar.com/

ఇప్ప‌టికే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఊర్వ‌శీ రౌతెలా ఓ హీరోయిన్ గా న‌టిస్తోంది. బాల‌య్య డ్యూయ‌ల్ రోల్ లో న‌టిస్తున్న ఈ సినిమాలో మ‌రో హీరోయిన్ ఎవ‌రన్న‌ది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో టాలీవుడ్ కు చెందిన మ‌రో యంగ్ హీరో ఓ కీల‌క నెగిటివ్ రోల్ చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. https://cinemaabazar.com/

ఈ సినిమాలో మ‌ల‌యాళ న‌టుడు షైన్ టామ్ చాకో కీల‌క పాత్ర‌లో న‌టిస్తుండ‌గా, ఆ పాత్ర‌కు త‌మ్ముడి పాత్ర‌లో స‌ద‌రు యంగ్ హీరో క‌నిపించ‌నున్నాడ‌ని అంత‌ర్గ‌త వ‌ర్గాల నుంచి స‌మాచారం అందుతుంది. ఇప్ప‌టికే ఈ సినిమాలో చాలా సర్‌ప్రైజ్‌లు ప్లాన్ చేసిన బాబీ, ఇప్పుడు మ‌రో యంగ్ హీరోను కూడా ట్రాక్ ఎక్కిస్తున్నాడ‌ని తెలిసి ఇన్ని స‌ర్‌ప్రైజ్ లు త‌ట్టుకోల‌గ‌మా అంటూ బాబీని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు. ప్ర‌స్తుతం ఏపీ ఎల‌క్ష‌న్స్ హ‌డావిడిలో ఉన్న బాల‌య్య‌, ఆ హ‌డివిడి అవ‌గానే బ‌ల్క్ డేట్స్ ఇచ్చి సినిమాను పూర్తి చేయాల‌ని చూస్తున్నాడ‌ట‌.   https://cinemaabazar.com/

Related Posts

Latest News Updates