‘భరతనాట్యం’ క్యారెక్టర్స్, కంటెంట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది: నిర్మాత పాయల్ సరాఫ్

సూర్య తేజ ఏలే డెబ్యు మూవీ ‘భరతనాట్యం’. దొరసాని ఫేమ్ కెవిఆర్ మహేంద్ర దర్శకత్వం వహించారు. పిఆర్ ఫిలింస్ పతాకంపై పాయల్ సరాఫ్ నిర్మించారు. మీనాక్షి గోస్వామి కథానాయిక. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ ని క్రియేట్ చేశాయి. వేసవి కానుకగా ఏప్రిల్ 5న విడుదలకానున్న నేపథ్యంలో నిర్మాత పాయల్ సరాఫ్ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

మీకు సినిమాలపై ఆసక్తి ఎప్పుడు ఏర్పడింది ?
– నాకు చిన్నప్పటి నుంచే గ్లామర్ ఇండస్ట్రీలో ఏదైనా చేయాలనే ఆసక్తి వుండేది. అయితే నిర్మాత అవుతానని అనుకోలేదు. అనుకోకుండా ఇలాంటి మంచి అవకాశం వచ్చింది. చాలా మంచి కథ. ఇలాంటి మంచి కథతో నిర్మాతగా మారాలని నిర్ణయించుకున్నాను. పిఆర్ ఫిలింస్ బ్యానర్ పై మా మొదటి సినిమాగా  ‘భరతనాట్యం’ నిర్మించాము. నా పేరు, మా బాబు (రుషాంత్) పేరు  కలిసొచ్చేలా బ్యానర్ కి పేరు పెట్టడం జరిగింది.

ఈ సినిమా మీ భర్త హితేష్ గారి వలన కార్యరూపం దాల్చిందని విన్నాం ?
-అవును. హితేష్, సూర్య జిమ్ లో ఫ్రెండ్స్. తన దగ్గర వున్న కథని ఓ రోజు హితేష్ తో చెప్పాడు సూర్య. హితేష్ కి కథ చాలా నచ్చింది. హితేష్ కి కూడా సినీ పరిశ్రమపై ఆసక్తి వుంది. సినిమా చేద్దామా అని నన్ను అడిగారు. యాక్షన్, ప్రేమకథలతో పోల్చుకుంటే క్రైమ్ థ్రిల్లర్ కామెడీ సేఫ్ జోనర్ అనిపించి, సమిష్టిగా నిర్ణయం తీసుకొని ఈ సినిమాని నిర్మించాం.

‘భరతనాట్యం’ కథలో మిమ్మల్ని ఆకర్షించిన అంశాలు ఏమిటి ?
ఇందులో చాలా మంది అద్భుతమైన నటీనటులు వున్నారు. వైవా హర్ష, హర్ష వర్ధన్, అజయ్ ఘోష్, సలీమ్ ఫేకు .. వీళ్ళంతా గత చిత్రాలకు భిన్నమైన పాత్రలలో కనిపిస్తారు. ఇది నాకు చాలా నచ్చింది. ఇందులో కంటెంట్, క్యారెక్టర్స్ కి రొటీన్ కి భిన్నంగా వుంటాయి. వైవా హర్ష గారికి ఇది ది బెస్ట్ మూవీ అవుతుంది. హీరో హీరోయిన్స్ కొత్త వారు అయినప్పటికీ చాలా మంచి ప్యాడింగ్, కంటెంట్ వుంది.

‘భరతనాట్యం’ కథ గురించి ఒక్క లైన్ లో చెప్పాలంటే ?
దర్శకుడు కావాలని ప్రయయత్నించే ఓ కుర్రాడు.. ఆర్థిక, ఫ్యామిలీ, లవ్ లైఫ్ నుంచి సమస్యలు ఎదుర్కుంటూ అనుకోకుండా క్రైమ్ వరల్డ్ లో పడి అక్కడి నుంచి ఎలా బయటపడ్డాడనేది లైను.

ఈ సినిమా ప్రయాణంలో సినీ పరిశ్రమ గురించి ఏం నేర్చుకున్నారు ?
-చాలా నేర్చుకున్నాను. షూటింగ్ చేసి సినిమాని థియేటర్స్ లో రిలీజ్ చేసేస్తారని అనుకునేదాన్ని. అసలు పోస్ట్ ప్రొడక్షన్ గురించి ఐడియానే లేదు. అలాగే షూటింగ్ ఎదురయ్యే సవాళ్ళు గురించి కూడా తెలీదు. ఈ సినిమాతో సినిమా మేకింగ్ కి సంబధించిన చాలా అంశాలు నేర్చుకున్నాను.

దర్శకుడు కెవిఆర్ మహేంద్ర గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
-మహేంద్ర గారు అమేజింగ్ పర్శన్. ఆయన ఈ సినిమా కోసం వందశాతం ఎఫెర్ట్ పెట్టారు. చాలా విషయాలు వివరంగా నేర్పించారు. సినిమాని అద్భుతంగా తీశారు. నా మొదటి సినిమాకి మహేంద్ర గారు లాంటి దర్శకుడు దొరకడం నా అదృష్టం.

ఈ కథలో సూర్యనే హీరోగా అనుకోవడానికి కారణం ?
– కథ రాస్తున్నప్పుడే ఈ సినిమాకి మహేంద్ర గారు దర్శకుడిగా అయితే బావుంటుందని సూర్య అనుకున్నారు. తర్వాత కాస్టింగ్ అంతా డైరెక్టర్ గారే నిర్ణయించారు. ఈ కథ రాస్తున్నపుడు హీరోగా సూర్య చేయాలని అనుకోలేదు. అయితే ఇది ఆయన క్రియేట్ చేసిన కథ. పైగా పక్కింటి అబ్బాయిలా సింపుల్ గా వుండే పాత్ర. ఈ పాత్రకు సూర్యనే యాప్ట్ అనిపించింది. ఈ పాత్రకు న్యూ కమ్మర్  కావాలి. ఈ పాత్ర తనకు పర్ఫెక్ట్ గా నప్పింది. నిజానికి ఇది హీరో బేస్డ్ కథలా వుండదు. నటీనటులంతా కథలో భాగం అవుతారు.

కొత్త నిర్మాతగా ఎలాంటి స్ట్రగుల్స్ ఎదుర్కున్నారు ?
-సహజంగానే ఓ కొత్త నిర్మాత ఎవరిదైనా అపాయింట్మెంట్ తీసుకోవాలంటే కష్టం. మా కంటెంట్ బావుంది.. ఒక్క ఛాన్స్ ఇవ్వండని అడగడం కూడా చాలా కష్టం. నేనూ ఇలాంటి కష్టాలు ఫేస్ చేశాను. ఐతే సూర్య, డైరెక్టర్ గారు ఇలా అందరి సపోర్ట్ తో ఈ జర్నీ జరిగింది. ఇక్కడ ఎర్న్ చేస్తాను..  లేదా లెర్న్ చేస్తాను.. ఏదో ఒకటి జరుగుతుంది కదా?! అనే ఆలోచన సినిమా చేయడం జరిగింది.

చాలా సార్లు అనుకున్న బడ్జెట్ కంటే పెరుగుతుంది కదా ? తొలి సినిమా నిర్మాత  గా  దీన్ని ఎలా ఎదుర్కున్నారు ?
-నిజానికి మాకు ఇలాంటి సమస్య రాలేదు. మా ప్లాన్ ప్రకారమే జరిగింది. అనుకున్న దాని ప్రకారమే షూటింగ్ పూర్తి చేశాం.  ఆర్ధికంగా మాకు ఎలాంటి ఒత్తిడి రాలేదు. అదృష్టవశాత్తు అంతా స్మూత్ గా జరిగింది. అందరూ చాలా సపోర్ట్ చేశారు.

అజయ్ ఘోష్  గారి పాత్ర ఎలా ఉండబోతుంది ?
అజయ్ ఘోష్ పాత్ర సూపర్బ్. ఇంటర్వెల్ తర్వాత ఆయనే సినిమాని నడుపుతారు. సెకండ్ హాఫ్ నుంచి ఆయన పాత్ర నెక్స్ట్ లెవల్ లో వుంటుంది.

దీనికి ‘భరతనాట్యం’ టైటిల్ పెట్టడానికి కారణం ?
ఈ కథకు ‘భరతనాట్యం’ టైటిల్ యాప్ట్. సినిమా చూసిన తర్వాత అది ఇంకా బాగా అర్ధమౌతుంది.

మీరు నార్త్ అమ్మాయిలా కనిపిస్తున్నారు? తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు?
నేను నార్త్ అమ్మాయినే. కానీ పుట్టి, పెరగడం మాత్రం వనస్థలిపురం. ఇక్కడ అంతా తెలుగే కదా. నాకు తెలుగు రాయడం, చదవడం కూడా వచ్చు.

నిర్మాతగా కొనసాగుతారా ? హీరోయిన్ గా చేసే ఆలోచన ఉందా ?
నిర్మాణం కొనసాగించాలనే వుంది. సినిమాల నిర్మాణంపై ఇష్టం ఏర్పడింది.  నటిగా అవకాశాలు వస్తే తప్పకుండా చేస్తాను. మొన్న ప్రీరిలీజ్ వేడుకలో మా మామగారు మా కోడలికి హీరోయిన్ గా లాంచ్ చేయండని దర్శకుడిని అడిగారు.(నవ్వుతూ). నిర్మాతగా ఉంటూనే నటించే అవకాశాలు వస్తే తప్పకుండా చేస్తాను.

వివేక్ సాగర్ మ్యూజిక్ గురించి ?
-వివేక్ సాగర్ మా సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నాం. ఆయన అన్ని సినిమాలు చేయరు. మా సినిమాకి చాలా సపోర్ట్ చేశారు. స్పెషల్ కేర్ తీసుకుంటూ మ్యూజిక్ ఇచ్చారు. మ్యూజిక్ క్రేజీగా వుంటుంది. ఫస్ట్ కాపీ చూశాను. సినిమా అద్భుతంగా వచ్చింది. ఖచ్చితంగా ఆడియన్స్ ని అలరిస్తుంది. ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు.

Related Posts

Latest News Updates