‘ఆర్టికల్ 370’ సినిమాపై బ్యాన్ విధించిన అర‌బ్ దేశాలు..!

బాలీవుడ్ న‌టి యామి గౌతమ్ (Yami Gautham), ప్రియ‌మ‌ణి (Priyamani) ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన‌ తాజా చిత్రం ‘ఆర్టికల్ 370’ (Article 370). ఈ సినిమాకు రెండుసార్లు జాతీయ అవార్డు గ్రహీత ఆదిత్య సుహాస్ జంభలే (Aditya Suhas Jambhale) దర్శకత్వం వహించ‌గా.. జియో స్టూడియోస్, A B62 స్టూడియోస్ బ్యాన‌ర్‌ల‌పై ఉరి: ది సర్జికల్ స్ట్రైక్(Uri : The Surgical Strike) ఫేమ్ ఆదిత్య ధ‌ర్ నిర్మించాడు. ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 23న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి ప్ర‌స్తుతం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. అయితే ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్‌తో పాటు నెగిటివ్ రివ్యూస్ వ‌స్తున్న విష‌యం తెలిసిందే. https://cinemaabazar.com/

ఇదిలావుంటే తాజాగా ఈ సినిమాపై అర‌బ్ దేశాలు బ్యాన్ విధించాయి. ఈ సినిమా ఒక వ‌ర్గాన్ని మాత్ర‌మే అణచివేతకు గుర‌యిన‌ట్లు మ‌రో వ‌ర్గం మొత్తం విల‌న్స్ అన్న‌ట్లు చూపించార‌ని అందుకే ఈ సినిమాను బ్యాన్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాయి. మ‌రోవైపు ఈ సినిమా విడుద‌ల కాక‌ముందే ప్ర‌ధాని మోడీ కొన్ని విషయాల గురించి సరైన సమాచారం తెలుసుకోవాలంటే ‘ఆర్టికల్ 370’ లాంటి చిత్రాలను చూడాలని ప్ర‌క‌టించాడు. దీంతో ఈ మూవీ చూసిన నెటిజ‌న్లు కొంద‌రు ప్ర‌శంస‌లు కురిపిస్తుండ‌గా.. మ‌రికొంద‌రు ఇది ఒక బీజేపీ ప్రాపగండ మూవీ అని.. కామెంట్స్ చేస్తున్నారు. కాశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ, ర‌జాక‌ర్ ఫైల్స్ ‘ఆర్టికల్ 370’ ఇలా బీజేపీ ప్రాపగండ మూవీల‌న్నింటిని ఒక్కొక్కటిగా వదులుతుంద‌ని నెటిజ‌న్లు తెలుపుతున్నారు. https://cinemaabazar.com/

ఈ సినిమా క‌థ విష‌యానికి వ‌స్తే.. 2019 ఫిబ్ర‌వ‌రి 14న పుల్వామా దాడి జ‌రిగిన అనంతరం జమ్ముకశ్మీర్‌ (Jammu and Kashmir)కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370 ర‌ద్దు చేసే అంశం తెర‌పైకి వ‌స్తుంది. అయితే ఆర్టికల్‌ 370ను ర‌ద్దు చేసే క్ర‌మంలో కశ్మీర్‌లో ఎలాంటి సంఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయి అనే ఆధారంగా ఈ సినిమా వ‌చ్చింది. ఇక ఈ సినిమాలో యామి గౌతమ్ పవర్‌ఫుల్‌ ఇంటెలిజెన్స్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌నుండ‌గా.. ప్రియమణి కీలక పాత్ర పోషించింది. https://cinemaabazar.com/

Related Posts

Latest News Updates