టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh)- జాకీ భగ్నానీ (Jackky Bhagnani) వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. ఈనెల 22న గోవా (Goa)లోని ఐటీసీ గ్రాండ్ రిసార్ట్‌లో అతి కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. వివాహం అనంతరం రకుల్ అత్తారింట్లో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా సంప్రదాయం ప్రకారం మెట్టినింట్లో తొలిసారి హల్వా (halwa) తయారు చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను రకుల్ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ‘ఇవే గృహిణి లక్షణాలు..’, ‘సూపర్..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. https://cinemaabazar.com/
కాగా, ఉత్తర భారతదేశంలో పెళ్లైన రెండో రోజు కొత్త కోడలు ఇంట్లో స్వీట్ తయారు చేయాల్సి ఉంటుంది. సంప్రదాయం ప్రకారం నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ‘చౌకా చర్దానా’ (Chauka Chardhana) అని పిలుస్తారు. ఇందులో భాగంగా కొత్త పెళ్లి కూతురు (New bride) తొలిసారి అత్తారింట్లో ఏదో ఓ స్వీట్ తయారు చేయాల్సి ఉంటుంది. హల్వా, ఖీర్ వంటి వంటకాన్ని తయారు చేసి అత్తింటి వారికి రుచి చూపిస్తారు. ఈ సంప్రదాయంలో భాగంగానే రకుల్ సూజీ కా హల్వా తయారు చేసింది. https://cinemaabazar.com/
రకుల్ – జాకీ భగ్నానీ వివాహం ఈ నెల 22వ తేదీన గోవా (Goa)లోని ఐటీసీ గ్రాండ్ రిసార్ట్‌లో ఘనంగా జరిగింది. పంజాబీ ఆనంద్ కరాజ్, సింధీ సంప్రదాయాల ప్రకారం ఈ జంట పెళ్లి జరిగింది. ఈ వేడుకకు శిల్పాశెట్టి, ఆయుష్మాన్ ఖురానా, అర్జున్ కపూర్, డేవిడ్ ధావన్‌తో పాటు పలువురు సెలబ్రెటీలు హాజరయ్యారు. ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను నూతన జంట ఇప్పటికే సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. https://cinemaabazar.com/
ఇక రకుల్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం హిందీలో మేరీ పత్నీ కా రీమేక్‌లో నటిస్తోంది. ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. మరోవైపు తమిళంలో తెరకెక్కుతున్న ఇండియన్ 2 సినిమాలో ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తోంది. రకుల్ తెలుగులో చివరగా 2021లో వచ్చిన కొండపొలం చిత్రంలో కనిపించింది.