అల్ట్రా మీడియా & ఎంటర్టైన్మెంట్ ఐన్స్టిన్ మీడియాతో అనుసంధానం !!!

ఐన్స్టిన్ మీడియా నిర్మించిన అంథోని సినిమాను ఫ్యాన్సీ రేటుకు డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకున్న అల్ట్రా మీడియా. అల్ట్రా మీడియా సౌత్ లో మంచి సినిమాలతో ప్రవేశించింది అందులో భాగంగా మలయాళంలో విజయం సాధించిన అంథోని సినిమా రైట్స్ ను తీసుకుంది. దీంతో ఆడియన్స్ లో అల్ట్రా మీడియాకు మళయాలంలో మంచి బజ్ తో పాటు గుర్తింపు లభించింది.

బాలీవుడ్ లో సుశీల్ కుమార్ అగర్వాల్ స్థాపించిన అల్ట్రా మీడియా సంస్థ త్వరలో తెలుగు , తమిళ్ లో కూడా మంచి సినిమాల డిజిటల్ రైట్స్ ను తీసుకోబోతున్నారు, అలాగే అన్ని సౌత్ లాంగ్వేజెస్ లో సినిమాలు నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఐన్స్టిన్ మీడియా సీఈఓ జాక్ పాల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ… అంథోని సినిమా డిజిటల్ రైట్స్ ను అల్ట్రా మీడియా కు ఇవ్వడం సంతోషంగా ఉంది. మా సినిమా మరింత ఎక్కువ ఆడియన్స్ కు చేరువ అవ్వడానికి అల్ట్రా మీడియా హెల్ప్ అవుతుందని భాభిస్తున్నాను అన్నారు.

అల్ట్రా మీడియా & ఎంటర్టైన్మెంట్ ఐన్స్టిన్ మీడియా కాంబినేషన్ లో కొత్త కథకతో సౌత్ లో అన్ని భాషల్లో సినిమాలు రాబోతున్నాయి, వాటి వివరాలు త్వరలో తెలియనున్నాయి.

Related Posts

Latest News Updates