టైటిల్ తో పాటుగా విజయ్ 68 మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్!

న్యూ ఇయర్ కి ముందుగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నెక్స్ట్ మూవీ టైటిల్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. సినిమా టైటిల్‌ను ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని ప్రకటించారు. టైటిల్‌తో పాటుగా మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఆడియెన్స్ ను ఫస్ట్ లుక్ పోస్టర్ విశేషం గా ఆకట్టుకుంటుంది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.

కొద్దిరోజుల క్రితం ఈ సినిమా టైటిల్ బాస్ లేదా పజిల్ అని పుకార్లు వచ్చాయి, అయితే నిర్మాత ఆ ఊహాగానాలను తోసిపుచ్చారు. ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మీనాక్షి చౌదరి ఇందులో కథానాయికగా నటిస్తోంది. విడుదల తేదీ ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఈ సినిమాలో జయరామ్, స్నేహ, లైలా, యోగిబాబు, వీటీవీ గణేష్, అజ్మల్ అమీర్, మైక్ మోహన్, వైభవ్, ప్రేమి, అజయ్ రాజ్, అరవింద్ ఆకాష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై అర్చన కలాపతి, కళపతి ఎస్ అఘోరం, కలపతి ఎస్ గణేష్, కళపతి ఎస్ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

Related Posts

Latest News Updates