“టిల్లు స్క్వేర్” నుండి ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్!

టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ టిల్లు స్క్వేర్. ఈ చిత్రం గతంలో రిలీజైన డీజే టిల్లు కి సీక్వెల్ గా తెరకెక్కుతోంది. ఫిబ్రవరి 9, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కానున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. న్యూ ఇయర్ సందర్భంగా మేకర్స్ ఈ చిత్రం కి సంబందించిన సరికొత్త పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది.

యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమా లో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అనుపమ పరమేశ్వరన్ హీరో సిద్దు జొన్నలగడ్డ ఒడిలో కూర్చొని వెనక్కి తిరిగి చూస్తున్న స్టిల్ ను పోస్టర్ లో చూపించారు. ఈ బోల్డ్ లుక్ లో, రొమాంటిక్ గా ఉన్న పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటుంది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రామ్ మిర్యాల సంగీతం అందిస్తున్నారు.

Related Posts

Latest News Updates