జనసేన పార్టీ ప్రచార విభాగం ఛైర్మన్ గా శ్రీ బన్నీ వాస్

* నియామక ఉత్తర్వులు అందజేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు

జనసేన పార్టీ ప్రచార విభాగం ఛైర్మన్ గా శ్రీ బన్నీ వాస్ ను పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నియమించారు. గురువారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నియామక ఉత్తర్వులను స్వయంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీ బన్నీ వాస్ కు అందజేశారు. ప్రచార విభాగం పార్టీకి కీలకమైందని, సమన్వయంతో ప్రచార విభాగాన్ని ముందుకు నడిపించాలని ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించారు. పార్టీ ఆశయాలను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడంతోపాటు రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపునకు వినూత్న కార్యక్రమాలను రూపొందించాలని చెప్పారు. పార్టీ ఉన్నతి కోసం మరింతగా కష్టపడాలని ఈ సందర్భంగా శ్రీ బన్నీ వాస్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.

Related Posts

Latest News Updates