సినీ మరియు సామజిక ప్రతిభకు పట్టం కట్టింది. ‘జోష్ ‘ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమం..తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో ఫుల్ ‘జోష్’ గా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రొడ్యూసర్స్ కౌన్సిలర్ సెక్రటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ..
గత 9 సంవత్సరాల నుండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రా ప్రభుత్వలు చెయ్యని ఈ అవార్డ్స్ ఫంక్షన్ ఎంతోమంది కళాకారులను ప్రోత్సాహిస్తూ సంజోష్ తగరం చేస్తున్నాందుకు గర్వించదగ్గ విషయం నిజంగా నా అభినందనలు అన్నారు..
మరో అతిథిగా విచ్చేసిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్ ముత్యాల రామదాసు గారు మాట్లాడుతూ…. కింది స్థాయి కళాకారులను గుర్తించి వారికి ఒక గుర్తింపు ఇవ్వడం చాలా గొప్ప విషయం ఇంత గొప్పగా ఆలోచించిన సంజోష్ తగరం కి నా ఆశీస్సులు ఎలా వేళలు ఉంటాయి అన్నారు.
హీరోయిన్ నేహా గారు మాట్లాడుతూ : నాకు ఈ అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ప్రతేక్య కృతఙ్ఞతలు ‘ జోష్, అవార్డ్స్ అధినేత సంజోష్ తగరం గారు మరియు టీం అందరికి అందరికి కృతఙ్ఞతలు తెలిపారు..
చివరగా ‘జోష్ ‘అవార్డ్స్ ఎక్సలెన్స్ అధినేత సంజోష్ తగరం గారు మాట్లాడుతూ : చాలా మంది కళాకారులు టాలెంట్ ఉండి కూడ అవకాశం రాక గుర్తింపు లేక వెనుకపడి పోయారు అలాంటి టాలెంట్ ఉన్న కళాకారులను ఒక గుర్తింపు ఇచ్చి మళ్ళీ వాళ్ళకు అవకాశం కలిపించి వాళ్ళ టాలెంట్ ని బయటకు తీసుకరావాలనేదే ఈ సంస్థ యొక్క సంకల్పం అన్నారు. టాలెంట్ ఉన్న కళాకారులు ఎవరు ఉన్న ఎంకరేజ్ చేస్తానని ఈ సందర్బంగా తెలియజేసారు. ఈ కార్యక్రమనికి విచ్చేసి విజయవంతం చేసిన అతిథులకు ఫ్రెండ్స్ శ్రేయిభిలాషులకు కృతజ్ఞతలు తెలియజేసారు.
అలాగే ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు చేసి టాలెంట్ ముందుకు తీసుక వచ్చి టాలెంట్ ఉన్న వాళ్ళందరికి అవకాశం కలిపించలని ముఖ్య అతిథి విచ్చేసిన పలువురు ‘జోష్ ‘ ఎక్సలెన్స్ అవార్డ్స్ అధినేత సంజోష్ తగరం ని కోరారు. ఈ
ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ దయ్యాల అశోక్ , ప్రొడ్యూసర్ ముస అలీఖాన్ , సోషల్ వర్కర్ శ్రీవేణి , సీనియర్ యాక్టర్ దొరస్వామి , హీరోయిన్ నేహా యాక్టర్ మైఖేల్ సిద్దు , సోషల్ వర్కర్ జ్యోతి నంబూరి లక్ష్మి కుమారి ,సంతోషిన’ చక్ర తులసి గ] ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.. తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్ద ఎత్తున పలువురు హాజరయ్యి కార్యక్రమాన్ని విజయవంతం చేసారు..