రక్షిత్ అట్లూరి, అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్ హీరో హీరోయిన్స్ గా నటించి ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది “నరకాసుర” సినిమా. సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిలిం మేకర్స్ బ్యానర్స్ లో డాక్టర్ అజ్జా శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రానికి సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకత్వం వహించారు. “నరకాసుర” మూవీకి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా సక్సెస్ మీట్ లో తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు “నరకాసుర” మూవీ టీమ్. సోమవారం నుంచి ఈ సినిమాను థియేటర్స్ లో ఒక టికెట్ పై ఇద్దరు ప్రేక్షకులు చూసే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో
హీరో రక్షిత్ అట్లూరి మాట్లాడుతూ – “నరకాసుర” సినిమాకు థియేటర్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. రక్షిత్ బాగా నటించాడు, ఈ సినిమాతో నటుడిగా మరో మెట్టు ఎక్కాడనే ప్రశంసలు వస్తున్నాయి. ప్రేక్షకుల నుంచి అప్రిషియేషన్స్ తో పాటు మీడియా నుంచి మంచి రివ్యూస్ వస్తున్నాయి. మా సినిమాలో మెసేజ్ మరింత మంది ప్రేక్షకులకు రీచ్ అవ్వాలని మండే నుంచి థర్స్ డే వరకు ఒక టికెట్ మీద ఇద్దరు ప్రేక్షకులు సినిమా చూసేందుకు అవకాశం కల్పిస్తున్నాం. “నరకాసుర” వంటి మంచి సినిమాను థియేటర్స్ లో చూడండి, ఈ ప్రయత్నంలో మమ్మల్ని గెలిపిస్తారని ఆశిస్తున్నా. అన్నారు.
దర్శకుడు సెబాస్టియన్ మాట్లాడుతూ – మా “నరకాసుర” సినిమాను పెద్ద హిట్ చేసిన ఆడియెన్స్ కు థ్యాంక్స్ చెబుతున్నాం. సినిమా చూసిన వాళ్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. మీడియా రివ్యూస్ చాలా పాజిటివ్ గా ఉన్నాయి. కొందరు పర్సనల్ గా నాకు సినిమా ఆకట్టుకుందని మెసేజ్ లు పంపుతున్నారు. సినిమా బాగుందని చెప్పడమే కాదు మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, యాక్టర్స్ పర్ ఫార్మెన్స్, ఫైట్స్..ఇలా ప్రతి క్రాఫ్ట్ వర్క్ బాగుందని ప్రశంసలు వస్తున్నాయి. ట్రాన్స్ జెండర్స్ ను చిన్న చూపు చూడకూడదు మనుషులంతా ఒక్కటే అని మేము ఇచ్చిన సందేశం ప్రేక్షకులకు రీచ్ అవుతోంది. ఇది మరింత మంది ప్రేక్షకులకు చేరేలా వచ్చే సోమవారం నుంచి గురువారం వరకు ప్రతి థియేటర్ లో ఒక్కో టికెట్ పై ఇద్దరు ప్రేక్షకులు సినిమా చూడొచ్చు. రక్షిత్ పర్ ఫార్మెన్స్ ఇంప్రెసివ్ గా ఉందంటున్నారు. ఈ మూవీ జర్నీలో నాకు సపోర్ట్ చేసిన మా ప్రొడ్యూసర్, ఇతర టీమ్ మెంబర్స్ అందరికీ థ్యాంక్స్. అన్నారు.
నిర్మాత డాక్టర్ అజ్జా శ్రీనివాస్ మాట్లాడుతూ – “నరకాసుర” మూవీతో మా బ్యానర్ సుముఖ క్రియేషన్స్ కు మంచి పేరొచ్చింది. సినిమా చూసిన వాళ్లంతా మంచి మూవీ చేశారంటూ ప్రశంసిస్తున్నారు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయని అంటున్నారు. విదేశాల నుంచి మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి అప్రిషియేట్ చేస్తున్నారు. రక్షిత్ తో పాటు హీరోయిన్స్, ఇతర కీ ఆర్టిస్టుల పర్ ఫార్మెన్స్ ఆకట్టుకుందని అభినందిస్తున్నారు. “నరకాసుర” చూడని వాళ్లు థియేటర్స్ కు వెళ్లండి, ఈ సినిమాలోని మంచి మెసేజ్ ను ఇతరులకు చెప్పండి. మా సంస్థలో గుర్తుండిపోయే సినిమా చేసిన డైరెక్టర్ సెబాస్టియన్ గారికి థ్యాంక్స్. అన్నారు.
హీరోయిన్ అపర్ణ జనార్థన్ మాట్లాడుతూ – ప్రేక్షకుల ఆదరణ వల్లే మేము ఈ వేదిక మీద ఉండగలిగాం. “నరకాసుర” సినిమాకు మీరు చూపిస్తున్న ఆదరణకు థ్యాంక్స్. మా సినిమా టీజర్ రిలీజ్ నుంచి సినిమా రిలీజ్ వరకు సపోర్ట్ చేసిన వారందరికీ థ్యాంక్స్. “నరకాసుర” చూడని వారు తప్పకుండా థియేటర్స్ కు వెళ్లండి. అని చెప్పింది
హీరోయిన్ సంగీర్తన విపిన్ మాట్లాడుతూ – “నరకాసుర” మూవీకి థియేటర్స్ లో హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. మా మూవీ సూపర్ హిట్ చేసిన అందరికీ థ్యాంక్స్. ఈ జర్నీ మాకెంతో స్పెషల్. కష్టపడిన సినిమాకు తప్పకుండా ఫలితం దక్కుతుంది అనేందుకు మా “నరకాసుర” మూవీ లేటెస్ట్ ఎగ్జాంపుల్. నాకు ఈ సినిమా జర్నీలో సపోర్ట్ చేసిన టీమ్ కు థ్యాంక్స్. “నరకాసుర” మూవీ చూడని వారు థియేటర్స్ కు వెళ్లమని కోరుతున్నా. అని చెప్పింది.
నటీనటులు – రక్షిత్ అట్లూరి, అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్, శతృ, నాజర్, చరణ్ రాజ్, తేజ చరణ్ రాజ్, శ్రీమాన్, గాయత్రి రవిశంకర్ తదితరులు
సాంకేతిక నిపుణులు :
బ్యానర్స్ : సుముఖ క్రియేషన్స్ అండ్ ఐడియల్ ఫిల్మ్ మేకర్స్
నిర్మాత : డాక్టర్ అజ్జా శ్రీనివాస్
సహ నిర్మాత : కారుమూరు రఘు
ఎడిటింగ్ : సిహెచ్ వంశీకృష్ణ
సినిమాటోగ్రఫీ : నాని చమిడిశెట్టి
సంగీతం : ఏఐఎస్ నాఫాల్ రాజా
యాక్షన్ : రోబిన్ సుబ్బు
కొరియోగ్రఫీ : పొలాకి విజయ్
లిరిక్స్ : వడ్డేపల్లి కృష్ణ
పిఆర్ఓ : జీఎస్ కే మీడియా
రచన, డైరెక్షన్ : సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ in