“మాఊరి పొలిమేర’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రం “మా ఊరి పొలిమేర 2” -సత్యం రాజేష్

విశ్వనాథ్. ద‌ర్శ‌కుడు. సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల ముఖ్యతారలుగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలాదిత్య, రాకేందు మౌళి ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి గౌరికృష్ణ నిర్మాత. ఈ చిత్రాన్ని ప్రముఖ పంపిణీదారుడు వంశీ నందిపాటి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.నవంబరు 3న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా గురువారం చిత్ర కథానాయకుడు సత్యం రాజేష్ పాత్రికేయులతో ముచ్చటించాడు. ఆ విశేషాలివి.

చాలా సినిమాల మధ్య విడుదలవుతోంది ఏమైనా ఒత్తిడి వుందా?
అలాంటిదేమీ లేదు. పార్ట్ 1 చూసిన ఆడియన్స్ మా సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. మా సినిమాకు ప్రత్యేకమైన ఆడియన్స్ వున్నారు. మాకు అదే ధైర్యం.

మొదటిభాగంతో పొల్చితే రెండవభాగం మేకింగ్ పరంగా రిచ్ గా వుంటుందా?
మొదటిభాగంలో మాకు వున్న బడ్జెట్ పరంగా అంతేవరకే చూపించాం. చాలా తక్కువ వర్కింగ్ డేస్ లో పూర్తిచేశాం. కానీ రెండోభాగం ప్రారంభానికి ముందే దీనిని చాలా ఖర్చుతో అనుకున్న లోకేషన్స్ ల్లో ఖర్చుకు వెనుకాడకుండా చిత్రీకరణ చేద్దాం అనుకున్నాం . అదే విధంగా రిచ్ గా, క్వాలిటీ మేకింగ్ లో చిత్రీకరణ చేశాం.

మొదటిపార్ట్ చిత్రీకరణ అప్పుడే పార్ట్ 2 వుందని అనుకున్నారా?
అనుకున్నాం. కానీ పార్ట్ 1కు వచ్చిన స్పందనను బట్టి చేద్దాం అనుకున్నాం. సో పార్ట్ 1కు అనూహ్య స్పందన రావడంతో ధైర్యంగా పార్ట్ 2 మొదలుపెట్టాం.

మీ పాత్ర కొత్తగా వున్నట్లు అనిపిస్తుంది?
నేను మొదట్నుంచీ కూడా కొత్త పాత్రలు చేయాలని అనుకునే వ్ వాడిని. ఆ తరహా లోనే నా సినిమాల ఎంపికలు వుండేవి. నటుడిగా ప్రూవ్ చేసే ఎలాంటి పాత్రలు చేయడానికి కైనా రెడీగా వుండేావాడిని. పొలిమేర లాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి.

రెండో భాగంలో మీ పాత్రలో మళ్లీ ట్విస్టులు వుంటాయా?
తప్పకుండా మిమ్ములను షాకింగ్ కు గురిచేసే ట్విస్టులు వుంటాయి. అవి మీకు సర్ ప్రైజింగ్ గా అనిపిస్తాయి.

మొదటి పార్ట్ చూడకపోయినా రెండో పార్ట్ అర్థం అవుతుందా?
దర్శకుడు కథను అలాగే రాసుకున్నాడు. పార్ట్ 1 చూస్తే సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు. చూడకపోయినా పార్ట్ 2నచ్చుతుంది. పార్ట్ 1 చూడనివాళ్లకు అర్థమయ్యేలా రెండోభాగం ప్రారంభంలో రీక్యాప్ వేస్తున్నాం.

ఈ సినిమా చేస్తున్నప్పుడు మీరు భయపడ్డరా?
పార్ట్ 1 చేస్తున్నప్పుడు భయపడ్డాను. ఫారెస్ట్ లో, రాత్రి పూట శ్మశానంలో చేతబడుల సన్నివేశాలకు భయపడ్డాను. చాలా వర్జినల్ లొకేషన్స్ లో షూట్ చేశారు. ఈ సినిమాల్లో సన్నివేశాల డిమాండ్ మేరకు నేను న్యూడ్ గా కనిపిస్తాను. ఏదైనా సినిమా కోసమే. ఇలాంటి అరుదైన అవకాశం అందరికి రాదు.

మీరు చేసిన పాత్రకు ఏమైనా రిఫరెన్స్ వుందా?
రియల్ లైఫ్ లో నాకు తెలిసి చేతబడులు చేసిన వాళ్లు ఎవరూ మనకు తారసపడరు. అందుకే ఈ పాత్ర కోసమే ఈ విషయాలు తెలుసుకుని నటించాను.

సెన్సార్ సర్టిఫికెట్ ఏ గ్రేడ్ వచ్చింది?
మాకు ముందే తెలుసు. అేనుకున్నట్లే ఏ సర్టిఫికెట్ వచ్చింది. ఎందుకంటే మా సినిమా అంతే భయంకరంగా వుంటుంది. చాలా ఒళ్లు గగుర్పొడించే సన్నివేశాలు వుంటాయి.

పొలిమేర 3లో కూడా మీరు నటిస్తారా?
ఒకే కథ కాబట్టి నాకు తెలిసి పొలిమేర 3 లో కూడా నేనే వుంటాను.

హీరోగా కంటిన్యూ చేస్తారా?
నేను హీరో కాదు. కేవలం ఆర్టిస్ట్ ని మాత్రమే. మంచి నటుడిగా పేరు తెచ్చుకోవాలనేది నా తపన. కేవలం హీరోగానే చేస్తానని అనడం లేదు. చిన్న కాన్సెప్ట్లతో వ్వ్ వచ్చిన సినిమాల్లో లీడ్ పాత్రలు చేస్తాను.

మీ 20 ఏళ్ల కెరీర్ ఎలా వుంది?
పెద్డగా సాధించిదేమి లేదు. కళ్లు మూసి తెరిచేలాగ 20 ఏళ్లు అయిపోయింది. డిఫరెంట్ పాత్రలు చేయాలని, నాకు నేను కొత్తగా కనిపించాలనే తపనతో కొనసాగుతున్నాను. కేవలం ఇలాంటి పాత్రలే చేయాలని నియమాలేమీ పెట్టుకోలేదు.

ఈ చిత్రాన్ని వంశీ నందిపాటి విడుదల చేయడం
ఈ చిత్ర నిర్మాత గౌరిక్రిష్ణ ఎక్కడ రాజీపడకుండా ఖర్చు పెట్టి సినిమాను నిర్మించాడు. అయితే ఈ సినిమాను వంశీ నందిపాటి విడుదల చేయడంతో సినిమాకు రెక్కలు వచ్చినట్లు అనిపించింది. వంశీ ఈ సినిమాను భారీ సినిమాలా ప్రమోషన్ చేసి సినిమాను విడుదల చేస్తున్నాడు.

ప్రస్తుతం చేస్తున్న సినిమాలు?
ఈ సినిమా తరువాత కొంత గ్యాప్ తీసుకుందామని అనుకుంటున్నాను. నా లైఫ్ లో పొలిమేర 2 పెద్ద విషయం. మళ్లీ ఇలాంటి అవకాశం వస్తుందో లేదో తెలియదు. గీతాంజలి , బాలకృష్ణ గారి సినిమా, మట్కా చిత్రాల్లో పెద్ద పాత్రలు చేస్తున్నాను. టెరెంట్ అనే సినిమాలో నేను లీడ్ రోల్ గా చేస్తున్నాను. నా కెరీర్ లో టెరెంట్ కూడా గొప్ప సినిమా అవుతుంది

Related Posts

Latest News Updates