జేడీ చక్రవర్తి తన విలక్షణ నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. జేడీ చక్రవర్తి ప్రస్తుతం మళ్లీ నటుడిగా ఫుల్ బిజీగా మారుతున్నారు. సిల్వర్ స్క్రీన్, ఓటీటీ ఇలా అన్ని రకాల మాధ్యమాల్లో కొత్త కంటెంట్‌ను ఎంచుకుంటున్నారు. కొత్త కథలు, భిన్న పాత్రలు ఆయన వద్దకే వస్తున్నాయి. అలా జేడీ చక్రవర్తి ఈ మధ్య ‘దయా’ అనే వెబ్ సిరీస్‌లో నటించారు. తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు.
ఓటీటీ ప్లే అనే సంస్థ దేశ వ్యాప్తంగా వచ్చిన ఓటీటీ కంటెంట్‌లో ది బెస్ట్ ఎంచుకుంది. ఓటీటీలో రిలీజ్ అయిన వెబ్ సిరీస్‌లకు అవార్డులను ఇచ్చింది. ఈ అవార్డుల్లో భాగంగా దయా వెబ్ సిరీస్‌కు రెండు అవార్డులు వచ్చాయి. బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్ కేటగిరీలో ‘దయా’కు అవార్డులు వచ్చాయి. దర్శకుడు పావన్ సాధినేని, హీరో జేడీ చక్రవర్తిలకు ఈ అవార్డులు వచ్చాయి.
జేడీ చక్రవర్తికి ఇలా అవార్డులు రావడం అనేది కొత్త కాదు. దహిణి ది విచ్ అనే సినిమాకు గానూ నైజీరియాలో ప్రతిష్టాత్మకంగా భావించే ఎకో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ యాక్టర్‌గా అవార్డు వచ్చింది. ఇక దయా వెబ్ సిరీస్‌కు వచ్చేసరికి ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. అందులో జేడీ చక్రవర్తి పాత్ర, ఆ పాత్రను మలిచిన తీరు, ఇచ్చిన ట్విస్టులు ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేశాయి.