#Nani31 యాక్షన్-ప్యాక్డ్ అన్‌చెయిన్డ్- పవర్‌ఫుల్ టైటిల్‌ ‘సరిపోదా శనివారం’

‘దసరా’తో పాన్ ఇండియా ఫేమ్ సంపాదించి, ‘హాయ్ నాన్న’ విడుదలకు సిద్ధమౌతున్న నేచురల్ స్టార్ నాని.. ‘అంటే సుందరానికీ’ లాంటి కల్ట్ ఎంటర్‌టైనర్‌ను అందించిన టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో మరోసారి జతకడుతున్నారు. ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత డివివి ఎంటర్‌టైన్‌మెంట్ డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి భారీ కాన్వాస్‌పై #Nani31 చిత్రాన్ని నిర్మించనున్నారు.

ఇటీవల ఒక చిన్న వీడియోతో ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసిన మేకర్స్.. టైటిల్‌ను అన్‌చెయిన్డ్ అనే మరో ఆసక్తికరమైన వీడియో ద్వారా అనౌన్స్ చేశారు. యాక్షన్-ప్యాక్డ్ అన్‌చైన్డ్ వీడియో…ప్రతి వారంలో ఒక రోజు అదుపు చేయలేని కథానాయకుడి అరుదైన, అసాధారణమైన క్యాలిటీని వివరిస్తూ సాయి కుమార్ వాయిస్‌ ఓవర్‌తో ప్రారంభమవుతుంది. ఆ విశేషమైన ఒక్క రోజు( శనివారం).. ”సరిపోదా శనివారం” అంటూ టైటిల్‌ని రివిల్ చేశారు. ఇది అసాధారణంగా, పవర్ ఫుల్ గా వుంది.

వివేక్ ఆత్రేయ పూర్తిగా ప్రత్యేకమైన కాన్సెప్ట్‌ని ప్రయత్నిస్తున్నారు. అన్‌చెయిన్డ్ హామీ ఇచ్చినట్లుగా ఈ చిత్రం నానిని మునుపెన్నడూ లేని డైనమిక్ అవతార్‌లో ప్రజెంట్ చేస్తోంది. నాని పాత్రకు హీరోయిక్ ఇంట్రడక్షన్ ఇవ్వబడింది, అతను విజేతగా బయటకు వచ్చినప్పుడు ప్రజల ముఖాల్లో చిరునవ్వు ఉండే ముగింపు ఎపిసోడ్ పాత్రకు తగిన ఎలివేషన్‌ని తెస్తుంది.

డిఫరెంట్ సబ్జెక్ట్‌లను ఎటెంప్ట్ చేస్తూ, క్యారెక్టర్‌ల అవసరానికి తగ్గట్టుగా మేకోవర్స్ చేసుకుంటున్న నాని రగ్గడ్ లుక్‌తో సర్ ప్రైజ్ చేశారు. ప్రతిదీ ప్రామెసింగా వుంది. ఈ సెన్సేషనల్ కాంబో టైటిల్ గ్లింప్స్ గొప్ప ముద్ర వేసింది. కెమెరా బ్లాక్స్ , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎక్స్ ట్రార్డినరీగా ఉన్నాయి. నిర్మాణ విలువలు సాలిడ్ గా ఉన్నాయి.

ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తుండగా, తమిళ స్టార్ నటుడు ఎస్ జే సూర్య కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా, మురళి జి సినిమాటోగ్రాఫర్. కార్తీక శ్రీనివాస్ ఎడిటర్.

పాన్ ఇండియా చిత్రం ‘సరిపోదా శనివారం’ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో అనౌన్స్ చేస్తారు. రేపు ఈ సినిమా ఓపెనింగ్ జరగనుంది.

నటీనటులు: నాని, ప్రియాంక అరుల్ మోహన్, ఎస్జే సూర్య

సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: వివేక్ ఆత్రేయ
నిర్మాతలు: డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి
బ్యానర్: డివివి ఎంటర్‌టైన్‌మెంట్
సంగీతం: జేక్స్ బిజోయ్
డీవోపీ: మురళి జి
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: వాల్స్ అండ్ ట్రెండ్స్

Related Posts

Latest News Updates