#కృష్ణారామా చాలా ప్రత్యేకమైన చిత్రం. టీజర్ లాంచ్ ఈవెంట్ లో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్‌

నటకిరీటి రాజేంద్ర ప్రసాద్‌, గౌతమి ప్రధాన పాత్రల్లో దర్శకుడు రాజ్‌ మదిరాజు రూపొందించిన చిత్రం ‘#కృష్ణారామా’. అనన్య శర్మ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, చరణ్‌ లక్కరాజు, రవి వర్మ, జెమిని సురేశ్‌, రచ్చ రవి తదితరులు కీలక పాత్రలు పోషించారు. అద్వితీయ మూవీస్ బ్యానర్ పై వెంకట కిరణ్, కుమార్ కళ్లకూరి, హేమ మాధురి నిర్మించారు. ఈ సినిమా ఓటీటీ ‘ఈటీవీ విన్‌’లో అక్టోబర్ 22 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ టీజర్‌ లాంచ్ ఈవెంట్ ని నిర్వహించింది.

టీజర్ లాంచ్ ఈవెంట్ లో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ.. అన్ని జనరేషన్స్ కి అడ్జెస్ట్ అవ్వడం, అన్ని జనరేషన్స్ తో కలసి పని చేసే అవకాశం రావడం నా అదృష్టం. ఇప్పుడు సినిమా ఇంటికి వచ్చేసింది. నేరుగా ఓటీటీలో సినిమాలు విడుదలౌతున్నాయి. ఈ మార్పులు తగ్గట్టు కూడా నన్ను నేను మలుచుకుంటున్నాను. నేను నటించిన ఓటీటీ సినిమా ‘సేనాపతి’కి ముంబైలో బెస్ట్ పెర్ ఫార్మర్ అఫ్ ది ఇయర్ అవార్డ్ వచ్చింది. ఓటీటీ సినిమాలకి మంచి కంటెంట్ వుండితీరాల్సిందే. మంచి కంటెంట్ లేకపోతే వెంటనే ఛానల్ మార్చేస్తారు ఆడియన్స్. #కృష్ణారామా చాలా ప్రత్యేకమైన చిత్రం. రాజ్ గారు కథ చెప్పినపుడు చాలా సర్ ప్రైజింగ్ గా అనిపించింది. ఇప్పటి జనరేష్ కి తగిన కథ ఇది. సోషల్ మీడియా నేపధ్యంలో ఒక రిటైర్డ్ ఓల్డ్ పెయిర్ కోణంలో సాగే అద్భుతమైన కథ ఇది. #కృష్ణారామా చూసిన తర్వాత ప్రేక్షకులు కూడా కథలో భాగం అవుతారనే నమ్మకం వుంది. అంత నిజాయితీ కూడుకున్న కథ ఇది. రాజ్ గారు నటీనటుల ఎంపిక చాలా చక్కగా చేశారు. గౌతమీ, నేను ఈ పాత్రలు పోషించడం అద్భుతమైన అవకాశంగా భావిస్తున్నాము. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈటీవీ విన్‌’లో అక్టోబర్ 22 నుంచి ఈ సినిమా ప్రసారం అవుతుంది. పండగ చేసుకుంటూ ఇంట్లో ఈ సినిమా చూసి మా ఫ్యామిలీలో మీరంతా భాగస్వామ్యం కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

గౌతమి మాట్లాడుతూ… #కృష్ణారామా చాలా యూనిక్, స్పెషల్ ప్రాజెక్ట్. ఇలాంటి చక్కని కథని రాసిన దర్శకుడు రాజ్ గారి ధన్యవాదాలు. చాలా మోడ్రన్ సబ్జెక్ట్ ఇది. రాజేంద్ర ప్రసాద్‌ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నా ఫస్ట్ హీరో రాజేంద్ర ప్రసాద్‌ గారు. #కృష్ణారామా మ్యాజికల్ బ్యూటీఫుల్ ఫిలిం. ఈ సినిమా కోసం చాలా మంది యువ ప్రతిభావంతులు పని చేశారు. అనన్య నటించిన వెబ్ సిరీస్ నాకు చాలా ఇష్టం. నిర్మాతలు ఏ లోటు లేకుండా సినిమాని పూర్తి చేశారు. #కృష్ణారామా మెమరబుల్ మూవీ. తప్పకుండా అందరినీ అలరిస్తుంది” అన్నారు,

అనన్య శర్మ మాట్లాడుతూ.. ఇది నా మొదటి ఫీచర్ ఫిల్మ్. #కృష్ణారామా కథ మన నిజ జీవితంలో వుంటుంది. అమ్మమ్మ తాతయ్యల కథ ఇది. ఇంత మంచి సినిమాలో అవకాశం రావడం ఆనందంగా వుంది. రాజేంద్ర ప్రసాద్‌, గౌతమి గారితో పని చేయడం చాలా అనందంగా వుంది. ఈటీవీ విన్‌’లో అక్టోబర్ 22 న సినిమా విడుదలౌతుంది. అందరూ తప్పకుండా చూడండి” అన్నారు.

దర్శకుడు రాజ్‌ మదిరాజు మాట్లాడుతూ.. #కృష్ణారామా నాకు ఒక రోలర్ కోస్టర్ రైడ్. ఇది నా నాలుగో సినిమా. ‘రిషి’ తర్వాత మనసుపెట్టి రాసిన కథ ఇది. రాజేంద్ర ప్రసాద్‌ గారు సంపూర్ణ నటుడు. అన్నీ మంచి శకునములే సినిమాలో నటించినపుడు రాజేంద్ర ప్రసాద్‌ గారిని కలిసి కథ చెప్పాను. ఆయన చాలా నచ్చింది. కృష్ణా పాత్ర కోసం గౌతమి గారికి కథ చెప్పాను. గౌతమి గారికి కూడా నచ్చింది. ఇలాంటి గొప్ప నటులు ఇద్దరూ ప్రాజెక్ట్ లోకి వచ్చిన తర్వాత ఇంక వెనక్కి తిరిగి చూసుకోలేదు. వాళ్ళని చూస్తూ చాలా విషయాలు నేర్చుకున్నాం. ఈటీవీ సంస్థకు ధన్యవాదాలు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరు ధన్యవాదాలు. #కృష్ణారామా తప్పకుండా అందరినీ అలరిస్తుంది” అన్నారు.

నటీనటులు : నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, గౌతమి, అనన్య శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, చరణ్ లక్కరాజు, రవి వర్మ, జెమిని సురేష్, రచ్చరవి తదితరులు

టెక్నికల్ టీం:
కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: రాజ్ మాదిరాజు
నిర్మాతలు: వెంకట కిరణ్, కుమార్ కాళ్లకూరి, హేమ మాధురి
సంగీతం: సునీల్ కశ్యప్
కెమెరామెన్: రంగనాథ్ గోగినేని
ఎడిటర్: జునైద్ సిద్ధిక్
ఆర్ట్ డైరెక్టర్: విష్ణు నాయర్
పీఆర్వో: వంశీ శేఖర్

Related Posts

Latest News Updates