‘భగవంత్ కేసరి’ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు అనిల్ రావిపూడికే మోక్షజ్ఞను లాంచ్ చేసే బాధ్యతను బాలకృష్ణ అప్పగించారట. ‘భగవంత్ కేసరి’ దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా పట్ల బాలయ్య ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఆయనకు అనిల్ వర్క్ నచ్చడంతో మోక్షజ్ఞ డెబ్యూ మూవీని డైరెక్ట్ చేసే బాధ్యతను అప్పగించారట. అంతేకాదు ఇప్పటికే హీరోయిన్ ఎంపిక కూడా జరిగినట్లు సమాచారం. ‘భగవంత్ కేసరి’లో బాలయ్య కూతురిగా నటించిన శ్రీలీలనే మోక్షజ్ఞ మొదటి హీరోయిన్ అట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై క్లారిటీ రావొచ్చు అంటున్నారు.