ఉలగనాయగన్ కమల్ హాసన్ లాంచ్ చేసిన జీ స్టూడియోస్, పారలల్ యూనివర్స్ పిక్చర్స్ ఇండియన్ ఫస్ట్- సీ అడ్వెంచర్ హారర్ థ్రిల్లర్‌ ‘కింగ్‌స్టన్’

సంగీత దర్శకుడు-నటుడు జివి ప్రకాష్ కుమార్ సహజ నటుడిగా ప్రశంసలు అందుకున్నారు.విభిన్నమైన, ప్రత్యేకమైన కథలతో ప్రాజెక్ట్‌లను చేస్తున్నారు. ఇప్పుడు కొత్త దర్శకుడు కమల్ ప్రకాష్‌తో కలసి ‘ కింగ్‌స్టన్‌’ పేరుతో ఓ చిత్రాన్ని చేస్తున్నారు.
ఉలగ నాయగన్ కమల్ హాసన్ ఈ సినిమా టైటిల్ లుక్‌ను విడుదల చేశారు. ఈ చిత్ర ప్రారంభోత్సవంలో పాల్గొని తొలి షాట్‌కు క్లాప్ కొట్టి షూటింగ్‌ను ప్రారంభించారు.

జి.వి.ప్రకాష్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, దివ్య భారతి కథానాయికగా నటిస్తోంది. ‘మెర్కు తొడార్చి మలై’ ఫేమ్ ఆంటోనీ, చేతన్, కుమారవేల్, మలయాళ నటుడు సాబుమోన్ ఇతరకీలక పాత్రలు పోషిస్తున్నారు.

గోకుల్ బెనోయ్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి ధివేక్ డైలాగ్స్ రాస్తుండగా, శాన్ లోకేష్ ఎడిటింగ్ చేస్తున్నారు. ఎస్.ఎస్.మూర్తి ఆర్ట్ డైరెక్టర్, దిలీప్ సుబ్బరాయన్ యాక్షన్ కొరియోగ్రాఫర్. ‘కింగ్‌స్టన్’ సీ అడ్వంచరస్ హారర్ కథ. జీ స్టూడియోస్‌తో కలిసి జి.వి. ప్రకాష్ కుమార్ ప్యారలల్ యూనివర్స్ పిక్చర్స్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వెంకట్ ఆరుముగం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కాగా, దినేష్ గుణ క్రియేటివ్ ప్రొడ్యూసర్.

దర్శకుడు కమల్ ప్రకాష్ మాట్లాడుతూ.. నాలాంటి కొత్త దర్శకుడికి కింగ్‌స్టన్‌ లాంటి డ్రీమ్‌ స్క్రిప్ట్‌ రాసి దర్శకత్వం వహించే అవకాశం రావడం మాములు విషయం కాదు. నా విజన్‌ని నమ్మినందుకు జి వి ప్రకాష్, జీ స్టూడియోస్‌కు కృతజ్ఞతలు’’ తెలిపారు.

జీ స్టూడియోస్ సౌత్ మూవీస్ హెడ్ అక్షయ్ కేజ్రీవాల్ మాట్లాడుతూ, “జివి ప్రకాష్ , ప్యారలల్ యూనివర్స్ పిక్చర్స్‌తో కలిసి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో మా సహకారాన్ని అందించడం ఆనందంగా, గర్వంగా ఉంది. వెరీ టాలెంటెడ్ కమల్ ప్రకాష్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని అందించడం ఆనందంగా వుంది. కింగ్‌స్టన్ అద్భుతమైన కథనం, భారీ నిర్మాణ స్థాయితో పాటు ఒక ప్రత్యేకమైన వరల్డ్ లో సెట్ చేయబడింది. ఇది గొప్ప సినిమాటిక్ అనుభూతిని అందిస్తుంది. జీ స్టూడియోస్‌లో ప్రజలను అలరించే కంటెంట్‌ని రూపొందించడం మా లక్ష్యం.ఈ చిత్రంతో ఆ దిశగా అడుగులు వేస్తుంది’ అన్నారు

నిర్మాత-నటుడు-సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ మాట్లాడుతూ ”నిర్మాత కావాలనేది నా చిరకాల కోరిక. ఇప్పటివరకూ సరైన కథ కోసం ఎదురుచూశాను. “కింగ్‌స్టన్” స్క్రిప్ట్ విన్న తర్వాత.. ఇది పిల్లల నుండి పెద్దల వరకు ప్రేక్షకులని మెప్పిస్తుందని నమ్మకం కలిగింది. వెంటనే ఈ చిత్రాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాను. ఏదైనా సినిమా ప్రాజెక్ట్ ప్రారంభం ప్రత్యేకంగా ఉండాలి. నా ప్రొడక్షన్ హౌస్‌ని ప్రారంభించి, నన్ను అభినందించి, ఆశీర్వాదించిన మా ఉలగ నాయకన్ కమల్‌హాసన్‌ గారికి కృతజ్ఞతలు. నా ప్రొడక్షన్ హౌస్‌తో పాటు ఈ చిత్రాన్ని నిర్మించనున్న జీ స్టూడియోస్‌కి కూడా కృతజ్ఞతలు. సంగీత దర్శకుడిగా, నటుడిగా నా ప్రయాణాన్ని అందరూ ప్రోత్సహించి సపోర్ట్ ని ప్రేమని అందించారు. ఇప్పుడు నిర్మాతగా నా కొత్త వెంచర్‌కి కూడా మీ ప్రేమ అభిమానం కావాలి. అందరికి ధన్యవాదాలు’’ తెలిపారు.

‘కింగ్‌స్టన్’ టీమ్ మొత్తం ఇండియన్ ఫస్ట్ -అడ్వెంచర్ హారర్ థ్రిల్లర్‌ షూటింగ్ ప్రారంభమైనందుకు ఆనందంగా ఉంది. జి.వి. ప్రకాష్ కుమార్ తన 25వ చిత్రం ‘కింగ్‌స్టన్’ని నిర్మిస్తూ తన కొత్త ప్రొడక్షన్ హౌస్ – ప్యారలల్ యూనివర్స్ పిక్చర్స్‌ని ప్రారంభించడం ద్వారా ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించారు.

Related Posts

Latest News Updates