మిస్టరీ మూవీ నుంచి మొదటి ప్రచార చిత్రం విడుదల

పి వి ఆర్ట్స్ పతాకంపై తల్లాడ సాయికృష్ణ, స్వప్న చౌదరి హీరో హీరోయిన్ గా అలీ, సుమన్, తనికెళ్ళ భరణి ముఖ్య తారాగణం తో తల్లాడ సాయికృష్ణ దర్శకత్వం వహిస్తున్న చిత్రం “మిస్టరీ”. వెంకట్ పులగం నిర్మాత. ఈ చిత్రం యొక్క మొదటి పోస్టర్ ను పాత్రికేయుల సమక్షంలో విడుదల చేశారు చిత్ర యూనిట్. అనంతరం

సి కె రెడ్డి మాట్లాడుతూ “ఇది నా మొదటి చిత్రం. సుమన్ మరియు అలీ గారి లాంటి గొప్ప నటులతో పనిచేయడం చాలా గొప్పగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు తల్లాడ సాయికృష్ణ గారికి ధన్యవాదాలు” అని తెలిపారు.

స్వప్న చౌదరి మాట్లాడుతూ “నమస్తే సెట్ జి చిత్రంలో హీరోయిన్ గా పరిచయం అయ్యాను, సొగసు చూడ తరమ రెండో చిత్రం ఇప్పుడు మూడో చిత్రం మిస్టరీ లో హీరోయిన్ గా చేస్తున్నాను. మూడు సినిమా ఒకటి తర్వాత ఒకటి వెంట వెంటనే జరిగిపోయాయి. మిస్టరీ సినిమా చాలా బాగా వస్తుంది, కామెడీ అయితే సూపర్ గా వస్తుంది. మంచి సినిమా అందరికీ నచ్చుతుంది” అని తెలిపారు

యాక్టర్ రవి రెడ్డి మాట్లాడుతూ “సినిమా చాలా మిస్టరీ గా ఉంటుంది. చిన సినిమా కానీ మంచి సినిమా. అందరికీ నచ్చుతుంది” అని తెలిపారు.

వెంకట్ దుగిరెడ్డి మాట్లాడుతూ “నేను అమెరికా లో ఉంటాను, ఈ సినిమాలో మంచి కీలక పాత్ర చేస్తున్నాను, నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకి నా ధన్యవాదాలు” అని తెలిపారు .

సత్య మాట్లాడుతూ “నేను చాలా చిత్రాలు చేశాను కానీ మిస్టరీ చిత్రం లో ఇప్పటివరకు చేయని క్యారెక్టర్ చేస్తున్నాను, ఒక పవర్ ఫుల్ జర్నలిస్ట్ పాత్ర చేస్తున్నాను. కథ చాలా బాగుంది, కామెడీ కూడా బాగుంటుంది, షూటింగ్ చాలా వేగంగా జరుగుతుంది” అని తెలిపారు.

జబర్దస్త్ నవీన్ మాట్లాడుతూ “నేను ఆలీ గారితో కలిసి నటించాను, నా క్యారెక్టర్ చాలా బాగుంది. ఈ పోస్టర్ చూస్తుంటే రామ్ గోపాల్ వర్మ గారు గుర్తుకు వస్తున్నారు, ఆయన గారిలాగా మా చిత్రం హిట్ కావాలి” అని కోరుకున్నారు.

నిర్మాత వెంకట్ పులగం మాట్లాడుతూ “దర్శకుడు సాయికృష్ణ గారు నాకు కథ చెప్పినప్పుడు చాలా కొత్తగా అనిపించింది, వెంటనే సినిమా చేద్దాం అని నిర్ణయించుకున్నాను. సీనియర్ నటులు సుమన్ గారు, అలీ గారు, తనికెళ్ళ భరణి గారు మా చిత్రం లో ముఖ్యమైన పత్రాలు చేస్తున్నారు. సినిమా చాలా బాగా వస్తుంది” అని తెలిపారు.

హీరో, దర్శకుడు తల్లాడ సాయికృష్ణ మాట్లాడుతూ “టైం విలువ తెలుసుకోవాలి అంటే సుమన్ గారిని చూడాలి. ఫలానా టైం కి మీరు రావాలి అంటే కరెక్ట్ గా ఆ టైం కి వచ్చేస్తున్నారు. ఆయన చూసి నేను టైం విలువ తెలుసుకుంటున్న . నా పాత చిత్రాలు చూసి వెంకట్ పులగం గారు నాకు ఈ సినిమా ఇచ్చారు. ఈ చిత్రంలో ఒక కీలకమైన పోలీస్ క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్ కి సుమన్ గారు అయితే బాగుంటుంది అని సర్ కి సినిమా గురించి చెప్పగానే ఒప్పుకున్నారు. షూటింగ్ చాలా బాగా జరుగుతుంది 50% షూటింగ్ అయిపోయింది. 21 జులై కి షూటింగ్ పూర్తి అవుతుంది. సెప్టెంబర్ చివరి వారంలో విడుదల చేస్తాం. మిస్టరీ చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్ కామెడీ చిత్రం” అని తెలిపారు

సుమన్ గారు మాట్లాడుతూ “సినిమాలు చాలా చేస్తున్నాను కానీ ఈ మిస్టరీ చిత్రం కథ నాకు బాగా నచ్చింది. నేటి కాలం పిల్లలు తప్పుడు దారిలో నడుస్తున్నారు. ఎవరిని లెక్కచేయడం లేదు, తల్లిదండ్రులను కూడా లెక్కచేయడం లేదు, కొందరు పిల్లలు తల్లిదండ్రులను కొడుతున్నారు. అలాగే తల్లిదండ్రులు కూడా బిజీ అయిపోయి పిల్లల్ని పట్టించుకోవడం లేదు. మరి పిల్లలు డ్రగ్స్ కి బానిసలు అవుతున్నారు. సినిమా కథ చాలా బాగుంది, నేను పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నాను. షూటింగ్ బాగా జరుగుతుంది. తల్లాడ సాయి కృష్ణ మంచి ప్లానింగ్ లో ఉన్నాడు” అని తెలిపారు.

సినిమా పేరు – మిస్టరీ

హీరో – తల్లాడ సాయికృష్ణ, హీరోయిన్ – స్వప్న చౌదరి

నటి నటులు – అలీ, సుమన్, తనికెళ్ళ భరణి, వెంకట్ రామ్ రెడ్డి, రవి రెడ్డి, స్వప్న చౌదరి, సత్య శ్రీ, గడ్డం నవీన్ , ఆకెళ్ల గోపాల కృష్ణ.

బ్యానర్ – పి.వి.ఆర్ట్స్

ప్రొడ్యూసర్ – వెంకట్ పులగం

డైరెక్టర్ – తల్లాడ సాయికృష్ణ

కథ మాటలు – శివ కాకు

సంగీతం – రామ్ తవ్వ,

లిరిక్స్ – శ్రీనివాస్ సూర్య

కెమెరా – సుధాకర్ బాట్లే

Related Posts

Latest News Updates