తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో రాష్ట్ర చలన చిత్రాభివృధి సంస్థ ఆధ్వర్యంలో ఎఫ్‌డీసీ ఛైర్మన్ అనిల్ కూర్మాచలం గారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన పశుసంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమాభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు. ఈ సందర్బంగా సినిమా, టీవీ, నాటక సంస్థలకు చెందిన భాద్యులకు జ్ఞాపికను అందజేశారు.
ఈ కార్యక్రమంలో సమాచార శాఖ కమిషనర్ & ఎఫ్‌డీసీ మేనేజింగ్ డైరెక్టర్ కోరేం అశోక్ రెడ్డి గారు, తెలుగు ఫిలిం చాంబర్ అధ్యక్షుడు బసిరెడ్డి, తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షుడు దామోదర ప్రసాద్, అనుపమ్ రెడ్డి, జెమిని కిరణ్, ”మా” ఉపాధ్యక్షుడు మాదాల రవి, దర్శకుడు వైవిఎస్ చౌదరి, నటులు రాజీవ్ కనకాల, రోజా రమణి, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని, టివి ఫెడరేషన్ అధ్యక్షుడు నాగబాల సురేష్, కరీంనగర్ ఫిలిం సొసైటీ అధ్యక్షుడు పొన్నం రవి చంద్ర, ఫిలిం జర్నలిస్ట్ ప్రభు తదితరులు పాల్గొన్నారు.