“కర్ణ” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో సనాతన క్రియేషన్స్ బ్యానర్‌పై కళాధర్ కొక్కొండ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన “కర్ణ” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర చ‌ల‌న‌చిత్ర‌, టీవీ, థియేట‌ర్స్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మన్ శ్రీ. అనిల్ కుర్మాచ‌లం గారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినిమా టైటిల్‌ చాలా బాగుందని, మంచి కంటెంట్‌తో వస్తున్న ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సీనియర్ జర్నలిస్ట్ వెంకట్, నటులు దిల్ రమేష్, నూకరాజు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

Latest News Updates