మన్ కీ బాత్ అనేది కోట్లాది మంది భారతీయుల ‘మన్ కీ బాత్ ‘కి ప్రతిబింబం: మోదీ

మన్ కీ బాత్ అనేది కోట్లాది మంది భారతీయుల మన్ కీ బాత్ కి ప్రతిబింబమని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఈ మన్ కీ బాత్ అనేది కోట్లాది మంది భారతీయుల భావాల వ్యక్తీకరణ అని, ఈ కార్యక్రమానికి భారీ విజయాన్ని అందించిన దేశ ప్రజలకు మోదీ ధన్యవాదాలు తెలిపారు. మన్ కీ బాత్ 100 వ ఎపిసోడ్ సందర్భంగా ప్రధాని మోదీ మన్ కీ బాత్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం ఆత్మ నిర్భర భారత్ ను ప్రోత్సహించడం నుంచి మేక్ ఇన్ ఇండియా మరియు స్పేస్ స్టార్టప్‌ల వరకు విభిన్న రంగాలలో ప్రతిభావంతులైన వ్యక్తుల కథలను లోకానికి పరిచయం చేసిందని గుర్తు చేశారు. హర్ ఘర్ తిరంగా’ లేదా ‘క్యాచ్ ద రెయిన్’ వంటి ప్రజా ఉద్యమాలను రేకెత్తించడంలో మన్ కీ బాత్ ఒక ఉత్ప్రేరకంగా పనిచేసిందని హర్షం వ్యక్తం చేశారు.

 

సామాన్యుల సమస్యల పరిష్కారానికి, ప్రజలతో మమైకం కావడానికి మన్ కీ బాత్ కార్యక్రమం తనకెంతో ఉపకరించిందని ప్రధాని మోదీ అన్నారు. ఇలా కార్యక్రమం నిర్వహించడం దేశ చరిత్రలో ఓ కొత్త చరిత్ర నెలకొల్పినట్లైందని అన్నారు. మన్ కీ బాత్ 100 వ ఎపిసోడ్ లో భాగంగా ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ కార్యక్రమం వల్ల తాను అసామన్య సేవలు అందించిన పలువురు గురించి తెలుసుకున్నానని, సామాన్యుల సమస్యల పరిష్కారానికి ఇది ఎంతో ఉపకరించిందన్నారు. మన్ కీ బాత్ అంటే ఇతరులోని మంచి లక్షణాలను ఆరాధించడమే అని అన్నారు. తనకూ ఓ మార్గదర్శి వున్నారని, ఆయన పేరు లక్ష్మణరావు ఇనామ్‌దార్ అని తెలిపారు. తాము ఆయనను వకీల్ సాహెబ్ అని పిలిచేవారమని గుర్తు చేసుకున్నారు. ఇతరులలోని మంచి లక్షణాలను మనం ఆరాధించాలని ఆయన మాకు చెప్తూ ఉండేవారన్నారు.

మన్ కీ బాత్ మొదటి ఎపిసోడ్ 2014 అక్టోబరు 3న ప్రారంభమైందని, ఆ రోజు విజయ దశమి అని గుర్తు చేశారు. విజయ దశమి రోజున మనమంతా ‘మన్ కీ బాత్’ ప్రస్థానాన్ని కలిసికట్టుగా ప్రారంభించామన్నారు. చెడుపై మంచి విజయం సాధించినందుకు జరుపుకునే పండుగ విజయ దశమి అని చెప్పారు. దేశ ప్రజల మంచితనం, సకారాత్మక దృక్పథాల విశిష్ట సంబరంగా ఈ కార్యక్రమం మారిందన్నారు. ఇది ప్రతి నెలా వచ్చే పండుగ అని, దీని కోసం మనమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తామని అన్నారు. దీనిలో మనం పాజిటివిటీని చాటుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యాన్ని కూడా ఆనందంగా జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం ప్రారంభమైన తర్వాత అనేక నెలలు, సంవత్సరాలు గడిచాయంటే నమ్మశక్యంగా లేదని మోదీ చెప్పారు.

 

 

Related Posts

Latest News Updates