రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నివారణపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. ప్రతి కాలేజీలో కూడా ఎస్ఈబీ టోల్ ఫ్రీ నెంబర్ ను డిస్ ప్లే చేయాలని ఆదేశించారు. అలాగే వీటికి సంబంధించిన పెద్ద పెద్ద హోర్డింగ్స్ కూడా ఏర్పాటు చేయాలన్నారు. అలాగే మాదక ద్రవ్యాల నివారణపై జిల్లాల పోలీసు కార్యాలయాల్లో ప్రత్యేక డివిజన్ ను కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
మాదక ద్రవ్యాల నియంత్రణపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కాలేజీల్లో ఇంటెలిజెన్స్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని, వారి నుంచ నిరంతర సమాచారం సేకరించుకోవాలన్నారు. పిల్లలు డ్రగ్స్ బారిన పడకుండా కౌన్సిలింగ్ నిర్వహించాలని, మాదక ద్రవ్యాలు సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. గ్రామ సచివాలయాల్లో మహిళా పోలీసులకు వీటిపై అవగాహన కల్పించాలన్నారు.