తెలంగాణ  రాష్ట్ర  హోంమంత్రి మహమూద్‌ అలీ ఇం ట్లో నిర్వహించిన ఈద్‌-ఉల్‌-ఫితర్‌ వేడుకల్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు  ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సీఎం కేసీఆర్‌కు హోంమంత్రి, ఆయన కుటుంబీకులు ఘన స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్‌కు హోంమంత్రి జ్ఞాపికను బహూకరించారు. హోంమం త్రి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్‌ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్‌ మాసంలో ఆచరించే ఉపవాస దీక్షలు, దైవప్రార్థనలు, అవి పెంపొందించే క్షమాగుణం, కరుణ, ప్రేమ తదితర ఆధ్యాత్మిక భావనల గురించి సీఎం స్మరించుకున్నారు.

తనవెంట వచ్చిన మంత్రు లు, ప్రజాప్రతినిధులు, ముస్లిం మతపెద్దలతో సీఎం ఇష్టాగోష్టిగా మాట్లాడారు. పలువురు మత పెద్దలు, సామాన్యులను పేరుపేరునా పలకరించి, అలయ్‌ బలయ్‌ తీసుకొని శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యమకాలం నుంచి తనతో కొనసాగుతున్న బీఆర్‌ఎస్‌ సీనియర్‌ కార్యకర్త సత్తార్‌ గుల్షానీని సీఎం ఆప్యాయంగా ఆలింగనం చేసుకొన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, ప్రశాంత్‌రెడ్డి, సత్యవతిరాథోడ్‌, పువ్వాడ అజయ్‌, బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, ఎంపీ సంతోష్‌కుమార్‌, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, మధుసూదనాచారి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్‌, మేయర్‌ విజయలక్ష్మి, మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, కార్పొరేషన్ల చైర్మన్లు మసీఉల్లాఖాన్‌, సలీం, రవీందర్‌సింగ్‌, మేడె రాజీవ్‌సాగర్‌ తదితరులు పాల్గొన్నారు.