నెల 23 బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్షా తెలంగాణ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో హీట్ను పెంచబోతోంది. బీఆర్ఎస్‌, కాంగ్రెస్లను సవాల్చేస్తూ బీజేపీ తరుపున ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించేలా చేవెళ్ల బహిరంగ సభలో అమిత్షా ప్రసంగం ఉంటుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అమిత్షా పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్‌, అధికార బీఆర్ఎస్నుంచి కీలక నేతలు పలువురు బీజేపీ తీర్థం పుచ్చుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ, తాజా ప్రజాప్రతినిధులు కూడా లిస్టులో ఉన్నారన్న ప్రచారం జరుగుతుండడంతో అమిత్షా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

చేవెళ్ల పర్యటన షెడ్యూల్లో అమిత్షా తెలంగాణ నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యేందుకు సమయాన్ని కూడా కేటాయించారు. నోవాటెల్హోటల్లో తెలంగాణ కోర్కమిటీ సమావేశంలో అమిత్షా పాల్గొననున్నారు. బూత్కమిటీ ఏర్పాటు, బూత్సశక్తీకరణ్కార్య క్రమంలో వెనకబడిన నియోజక వర్గాలు, పార్టీలో లోపించిన కోఆర్డినేషన్‌, ఇటీవల ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్చేసిన వ్యాఖ్యలు, ఆతర్వాత ఎంపీ అర్వింద్‌, బండి మధ్య విభేదాలు, తదితర అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలంగాణ నేతలు చెబుతున్నారు.