అంగన్వాడీ ఖాళీలను వెంటనే భర్తీ చేయండి : సీఎం జగన్ ఆదేశాలు

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమంపై సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్ వాడీలలో నాడు- నేడు పనులపై సమీక్ష నిర్వహించారు. ఫౌండేషన్ సూళ్లలో భాగంగా మారిన సుమారు 10 వేలకు పైగా అంగన్ వాడీల్లో పనులు జరుగుతున్నాయని తెలిపారు. మిగిలిన సుమారు 45 వేల అంగన్ వాడీలలో కూడా ప్రాధాన్యతా క్రమంలో పనులు చేసుకుంటూ వెళ్లాలని అధికారులకు సీఎం సూచించారు.

 

అలాగే అంగన్వాడీల్లో ఏ సదుపాయాలు వున్నాయి, ఏ సదుపాయాలు లేవు? అన్న దానిపై గ్రామ సచివాలయాల ద్వారా రిపోర్టులు కూడా తెప్పించుకోవాలని సీఎం జగన్ సూచించారు. ప్రతి అంగన్వాడీ కేంద్రంలోనూ చేపట్టాల్సిన పనులపై ప్రతిపాదనలు తయారు చేసి, తనకే నివేదిక ఇవ్వాలని సూచించారు. ఖాళీగా వున్న అంగన్వాడీ వర్కర్లు, అంగన్వాడీ హెల్పర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు. అలాగే మహిళా శిశు సంక్షేమ శాఖలో వున్న పోస్టులను కూడా భర్తీ చేయాలన్నారు. ఎప్పటికప్పుడు అంగన్వాడీ సెంటర్లను పరిశీలిస్తూ… అక్కడి పరిస్థితులను మెరుగుపరిచేలా చర్యలు చేపట్టాలన్నారు.

Related Posts

Latest News Updates