కాంగ్రెస్ యువజన విభాగం జాతీయ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్ పై అసోం యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు అంకితా దత్తా సంచలన ఆరోపణలు చేశారు. బీవీ శ్రీనివాస్ తనను 6 నెలలుగా తీవ్రంగా వేధిస్తున్నారని పేర్కొంది. తన గురించి చులకనగా మాట్లాడేవారని, ఏ మందు తాగుతావ్? వోడ్కానా? టెకిలానా? అంటూ మెసేజ్ కూడా పంపారని వెల్లడించారు. కొన్ని రోజులు అంగ్ కితా దత్తా అసోం కాంగ్రెస్ యువజన విభాగం అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు.
అయితే… బీవీ శ్రీనివాస్ మధ్యలోనే పదవి నుంచి తప్పించారు. అయితే… తరుచుగా ఇలానే వేధించేవారని ఆమె పేర్కొంది. దీంతో భరించలేక.. అధిష్ఠానానికి చెప్పానని, అయినా.. ఎవ్వరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. తనకు రాహుల్ గాంధీ మీద అపారమైన నమ్మకం వుందని, అందుకే జమ్మూలో భారత్ జోడో యాత్ర జరుగుతున్న సమయంలో అక్కడి వెళ్లి, పీబీ శ్రీనివాస్ పై ఫిర్యాదు చేశానని ఆమె వెల్లడించారు. అయినా… ప్రియాంక గాంధీ కానీ, రాహుల్ కానీ పట్టించుకోవడం లేదని ఆమె అన్నారు.
తాను నాలుగు తరాల కాంగ్రెస్ వాదినని అంకితా దత్తా ట్వీట్ లో పేర్కొన్నారు. తానును ఇంటర్నల్ ఆర్గనైషన్ కు రెండుసార్లు పోటీ చేశానని, బూత్ కమిటీని ఏర్పాటు చేశానని చెప్పారు. అంతే కాదు ఒకానొక సందర్భంలో పోలీసుల దెబ్బలు కూడా తిన్నానని తెలిపారు. తాను ఢిల్లీలోని గౌహతి విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్ నుంచి ఎల్ఎల్బీ వరకు చేశానని చెప్పారు. పార్టీ ప్రయోజనాల కోసం ఇంతకాలం మౌనంగా ఉన్నానని.. కానీ శ్రీనివాస్ వల్ల వేధింపులు ఆగడం లేదని ట్వీట్ ద్వారా తెలియజేశారు.
గతంలో యూత్ కాంగ్రెస్ కి ప్రెసిడెంట్ గా పనిచేసిన కేశవ్ కుమార్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడన్న కారణాలతో మీటూలో భాగంగా అతన్ని తొలగించారని ఈ సందర్భంగా అంకిత గుర్తు చేసుకున్నారు. 6 నెలలుగా శ్రీనివాస్ తనను మానసికంగా వేధింపులకు, వివక్షకు గురి చేస్తున్నారని.. కానీ ఎటువంటి విచారణ ప్రారంభించలేదని చెప్పారు.