వైయస్‌ అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిపై కేసులు నిలబడవు : సజ్జల

వైయస్‌ అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిపై కేసులు నిలబడవని, ఎందుకంటే వాళ్ల ఏ తప్పు చేయలేదని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. కొంత కాలం ఇబ్బంది పెడతారేమో కానీ చివరకు న్యాయమే గెలుస్తుందని వ్యాఖ్యానించారు. వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ జరుగుతున్న తీరుపై సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. యథేచ్చగా అవాస్తవాలను ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అందులో భాగంగానే నిందితుడు దస్తగిరి మాటలను పతాక శీర్షికలో ప్రచురించారని పేర్కొన్నారు. విపక్షాల పొలిటికల్‌ ఎజెండాలో భాగంగానే అవినాష్‌రెడ్డికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారు. ఇదంతా వచ్చే ఎన్నికల్లో పని చేస్తుందని టీడీపీ దురాశ అన్నారు. కొంత కాలం ఇబ్బంది పెడతారేమో కానీ చివరకు న్యాయమే గెలుస్తుందన్నారు.

 

వివేకా కేసును రాజకీయ ఎజెండాలో భాగంగానే టీడీపీ వాడుకుంటోందని ఆరోపించారు. ఇలా చేస్తూ నీచ స్థాయికి దిగజారిపోతోందన్నారు. చంద్రబాబు క్షుద్ర విన్యాసంలో భాగంగానే నడుస్తోందని, ఓ ప్లాన్ ప్రకారమే పొలిటికల్ ఎజెండాగా మార్చుకున్నారని దుయ్యబట్టారు. ముందుగా నిర్ణయించుకున్నట్లుగానే దర్యాప్తు చేస్తున్నారని, వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డిని ఇరికించే కుట్రకు తెరలేపారని మండిపడ్డారు. వివేకా కేసును ఓ పథకం ప్రకారం వాడుకొని, సీఎం జగన్ ప్రతిష్టను దిగజార్చే విధంగా కుట్ర చేస్తోందన్నారు.

 

వివేకా కేసులో కొన్ని మీడియా సంస్థలు కల్పితాలు ప్రచారం చేస్తున్నాయని సజ్జల ఆరోపించారు. కట్టుకథలను నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని, ఎలా హత్య చేశాడన్నది దస్తగిరి స్వయంగా చెప్పాడని పేర్కొన్నారు. అసలు దస్తగిరిని అప్రూవర్ గా మార్చి బెయిల్ ఇప్పించెదవరని ప్రశ్నించారు. ప్రత్యక్ష సాక్షి రంగన్న వుండగా… అప్రూవర్ మాటల్ని సీబీఐ ఎందుకు పట్టించుకుంటోందని ప్రశ్నించారు. వివేకా కేసులో ఇష్టానుసారం సీబీఐ పేర్లు చెబుతుంటే.. కొన్ని మీడియా సంస్థలు అలాగే వేసేస్తున్నాయని సజ్జల అన్నారు.

Related Posts

Latest News Updates