‘ఎకో ఇండియా’ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ… వైద్య సిబ్బందికి ఉచితంగా శిక్షణ

‘ఎకో ఇండియా’ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ చేసుకుంది. ఈ విషయాన్ని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి కృష్ణ బాబు ప్రకటించారు. ఎకో ప్రాజెక్టు ద్వారా రోగులకు మెరుగైన వైద్యం అందిస్తామని ప్రకటించారు. ఈ సంస్థ పలు వైద్య కార్యక్రమాలపై వైద్య సిబ్బందికి శిక్షణ ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే తీసుకొచ్చిన ఫ్యామిలీ డైరెక్టర్ విధానాన్ని విజయవంతం చేయడానికి వైద్య సిబ్బందికి శిక్షణ ఇస్తామని, ప్రతి ఆరు నెలలకి ఓ సారి శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, బీపీ, షుగర్, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకి వైద్య సేవలు పకడ్బందీగా నిర్వహించేలా శిక్షణ వుంటుందని తెలిపారు. ఈ ఎంవోయూ ద్వారా ఏపీ ప్రభుత్వంపై ఎలాంటి భారం పడదని, మొత్తంగా ఉచితంగా శిక్షణ ఇవ్వడానికి ఎకో ఇండియా ముందుకు వచ్చిందన్నారు.

 

రాష్ట్రంలో పేద ప్రజలకు 24 గంటలు వైద్యం ఉచితంగా అందాలనే ఉద్దేశంతో ఏపీలో ఫ్యామిలీ డాక్టర్ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లుగా సీఎం జగన్ చెప్పారు. దేశచరిత్రలోనే వైద్యసేవల విధానంలో నూతన విధానానికి శ్రీకారం చుట్టాం. ఈ కాన్సెప్ట్‌ దేశ చరిత్రలోనే రోల్‌ మోడల్‌గా నిలుస్తుందని సీఎం జగన్‌ ఆకాంక్షించారు. ఏపీలో ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానాన్ని సీఎం జగన్  ప్రారంభించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామం వేదికగా ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఫ్యామిలీ డాక్టర్ సేవలు ప్రారంభం అవుతాయని చెప్పారు. ఇందులో భాగంగా ప్రతి గ్రామంలో వైఎస్‌ఆర్ విలేజ్ క్లినిక్ లు ఉంటాయని, ఇందులో 105 రకాల మందులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఈ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్‌లను పీహెచ్‌సీలతో అనుసంధానిస్తామని చెప్పారు.

Related Posts

Latest News Updates