ప్రపంచంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఫెమీనా మిస్ ఇండియా 2023 కిరీటానిన ఈ ఏడాది రాజస్థాన్‌కు చెందిన నందిని గుప్త గెలుచుకున్నారు. ఆదివారం రాత్రి అట్టహాసంగా జరిగిన వేడుకల్లో సినీ ప్రముఖులతో పాటు వివిధ రంగాలకు చెందిన ముఖ్యులు కూడా హాజరయ్యారు. అన్ని పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి, జడ్జిల హృదయాలను గెలుచుకున్న 19 ఏళ్ల నందిని గుప్త విజేతగా నిలిచి మిస్ ఇండియా కిరీటాన్ని దక్కించుకున్నారు. గతేడాది మిస్ ఇండియాగా నిలిచిన సినీశెట్టి విజేతకు కిరీటాన్ని అలంకరించారు. ఇక ఢల్లీికి చెందిన శ్రేయా పూన్జా మొదటి రన్నరప్‌గా, మణిపూర్‌కు చెందిన తౌనోజమ్ స్ట్రెలా లూవాంగ్ రెండో రన్నరప్‌గా నిలిచారు. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ నుంచి గోమతి, తెలంగాణ నుంచి ఊర్మిళ చౌహాన్‌లు మిస్ ఇండియా పోటీల్లో తుది వరకూ పోటీనిచ్చారు. 59వ ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో భాగంగా ఢల్లీితో సహా 29 రాష్ట్రాలకు చెందిన అందాల భామలు ఈ కంటెస్టెంట్‌లో పోటీ పడ్డారు. కేవలం తమ అందాలతోనే కాదు, ప్రతిభతోనూ జడ్జిల ప్రశంసలు అందుకున్నారు. తుది పోరులో అదరగొట్టిన నందిని గుప్త కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. మణిపూర్‌లోని కుమన్ లంపక్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ వేడుకల్లో సినీ తారలు కార్తిక్ ఆర్యన్, అనన్య పాండే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.