కేంద్రం గుడ్ న్యూస్… వచ్చే ఏడాది నుంచి 13 ప్రాంతీయ భాషల్లో

సాయుధ పోలీసు బలగాల కానిస్టేబుల్‌ పరీక్షలను ప్రాంతీయ భాషల్లో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. వచ్చే ఏడాది నుంచి 13 ప్రాంతీయ భాషల్లో సీఏపీఎఫ్‌ పరీక్షలను నిర్వహించనున్నట్లు కేంద్ర హోం వ్యవహరాల శాఖ నిర్ణయం తీసుకుంది. స్థానిక యువత ప్రమేయాన్ని పెంచే దిశగా కేంద్రం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లోనే ఎగ్జామ్స్‌ను నిర్వహిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి గుర్తించబడిన ప్రాంతీయ భాషల్లో పరీక్షలను ఏర్పాటు చేయనున్నారు. దేశంలో వచ్చే ఏడాది నుంచి మొత్తం 15 భాషల్లో పరీక్షలను ఏర్పాటు చేయనుంది. ఇప్పటి వరకు నిర్వహిస్తున్న హిందీ, ఇంగ్లీష్‌ భాషలతో పాటు కొత్తగా 13 ప్రాంతీయ భాషలను చేర్చుతోంది. ప్రాంతీయ భాషలైన అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, మళయాలం, కన్నడ, తెలుగు, తమిళ్‌, ఒడియా, ఉర్దూ, పంజాబీ, మణిపూర్‌, కొంకణీ లల్లో ఎగ్జామ్స్‌ను నిర్వహించనున్నారు. సీఆర్‌పీఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ, ఎన్‌ఎస్‌జీ ఇవన్నీ సీఏపీఎఫ్‌ కిందకే వస్తాయి.

Related Posts

Latest News Updates