జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే ఏం అర్హతలు కావాలి?

సీపీఐ, ఎన్సీపీ, టీఎంసీ పార్టీల జాతీయ గుర్తింపును కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా రద్దు చేసింది. ఆమ్ ఆద్మీకి జాతీయ హోదా కల్పించింది. అయితే… ఓ రాజకీయ పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కనీసం నాలుగు రాష్ట్రాల్లో ఆ పార్టీ గుర్తింపు పొంది వుండాలి. సార్వత్రిక ఎన్నికల్లో 4 రాష్ట్రాల్లో కనీసం 6 శాతం ఓట్లు పొందాలి. లేదా… 4 ఎంపీ సీట్లైనా సాధించుకోవాలి. అదీ కాకపోతే.. లోక్ సభలో 2 శాతం సీట్లను వుండాలి.

 

కనీసం 3 రాష్ట్రాల నుంచి ఆ పార్టీ ఎంపీలు పోటీ చేసి విజయం సాధించి వుండాలి. ఈ నిబంధనల్లో ఏ అర్హత వున్నా… ఆ పార్టీని ఈసీ జాతీయ పార్టీగా గుర్తిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం దేశంలో 6 పార్టీలకు జాతీయ హోదా కొనసాగుతోంది. అందులోకి కొత్తగా కేజ్రీవాల్ పార్టీ ఆమ్ ఆద్మీ వచ్చి చేరింది. 2012 లో కేజ్రీవాల్ పార్టీని స్థాపించారు. 2015,2022 ఢిల్లీ, పంజాబ్ ఎన్నికల్లో విజయం సాధించారు.

కేంద్ర ఎన్నికల సంఘం జాతీయ పార్టీల గుర్తింపు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్ కి జాతీయ హోదాను కల్పించింది. ఇదే సమయంలో ఇప్పటికే జాతీయ పార్టీలుగా గుర్తింపు పొందిన మమత సారథ్యంలోని టీఎంసీకి, పవార్ సారథ్యంలోని ఎన్సీపీకి, సీపీఐకి జాతీయ హోదా రద్దు చేసింది.

 

ఇక.. ఏపీలోనూ బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ గుర్తింపును ఈసీ తొలగించింది. తెలంగాణలో మాత్రమే బీఆర్ఎస్ గా కొనసాగుతుందని ప్రకటించింది. అయితే… తాము న్యాయపోరాటానికి సిద్ధమని టీఎంసీ ప్రకటించింది. ఇక… పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంపై ఆప్ నేతలు ప్రశంసలు కురిపించారు. తక్కువ సమయంలో ఈ మైలురాయిని చేరుకోవడానికి కేజ్రీవాల్ నేతృత్వమే కారణమని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా చెప్పారు.

Related Posts

Latest News Updates