కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారన్న వార్త తెగ ప్రచారంలో వుంది. ఈ మధ్యే ఆయన ప్రధాని మోదీతో కూడా భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో మరింత ప్రచారం లభించింది. ఈ నేపథ్యంలో ఎంపీ కోమటిరెడ్డి స్పందించారు. పార్టీని వీడుతున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా వున్నానన్న ప్రచారంలోనూ వార్తవం లేదని కొట్టిపారేశారు. రాహుల్ గాంధీ అనర్హతను నిరసిస్తూ… గాంధీభవన్ లో దీక్షలో పాల్గొన్నానని గుర్తు చేశారు.తనది కాంగ్రెస్ రక్తమని, తన ముందు ఇతర దారులేవీ లేవని స్పష్టం చేశారు.
నిరాధార వార్తలతో కాంగ్రెస్ ని, తనను నమ్ముకున్న వారిని అయోమయంలో పడేయవద్దని సూచించారు. పార్టీ మారేది వుంటే.. తానే ప్రకటిస్తానని, ప్రచారాలు చేయవద్దని కోరారు. పార్టీ మారాలనుకుంటే పీసీసీ ఇవ్వని సమయంలోనే మారిపోయేవాడినని, తాను కాంగ్రెస్ మనిషినని అన్నారు. డెవలప్ మెంట్ కార్యక్రమాల కోసమే తాను ప్రధాని మోదీని కలుస్తున్నానని, ఈ కారణంగానే పార్టీ మారుతున్నట్లు వార్తలు వస్తున్నాయని అన్నారు. పార్టీ ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకైనా, పార్లమెంట్ కే అయినా పోటీ చేసేందుకు రెడీ అని ప్రకటించారు.