గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ని పోలీసులు మళ్లీ అరెస్ట్ చేశారు. హనుమాన్ శోభాయాత్రకు బయల్దేరిన సమయంలో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. హనుమజ్జయంతి సందర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్ ఎక్కడ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారోనని భావించిన పోలీసులు… ముందస్తుగా అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి యేడాది వస్తున్న సంప్రదాయం ప్రకారం హనుమజ్జయంతి బైక్ ర్యాలీలో పాల్గొనడానికి వెళ్తున్నానని, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. అరెస్టుపై స్పందించిన రాజాసింగ్ రాష్ట్ర ప్రభుత్వం హిందువులపై కక్ష సాధింపు చర్యలు చేస్తోందని, హిందువులను జైల్లో పెట్టడమే బీఆర్ఎస్ ప్లాన్ అని మండిపడ్డారు. తను ర్యాలీలో పాల్గొంటో వచ్చిన సమస్యేంటని ప్రభుత్వాన్ని, పోలీసులను ప్రశ్నించారు. ఇక.. తనను అరెస్ట్ చేస్తే జరిగే విధ్వంసాలకు తాను ఏమాత్రం బాధ్యుడ్ని కాదని రాజాసింగ్ స్పష్టం చేశారు.